ఫ్యాక్ట్ చెక్: మైపాడు బీచ్‌లో జలకన్య.. నిజమెంత..?

సోషల్ మీడియాలో వచ్చే పుకార్లకు అంతు లేకుండా పోతోంది. రోజు రోజుకి ఫేక్ వార్తలు వినబడుతూనే ఉంటున్నాయి. తాజాగా ఒక వార్త వచ్చింది. అయితే అది ఫేక్ ఆ లేకపోతే నిజమా అనేది ఇప్పుడు చూద్దాం. మైపాడు బీచ్ లో జలకన్య కలకలం రేపినట్లు మత్స్యకారులకు జల కన్యకి చిక్కినట్లు సోషల్ మీడియా లో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

అయితే నిజంగా జలకన్య వచ్చిందా లేదు అంటే ఇది ఫేక్ ఆ అనేది ఇప్పుడు మనం చూద్దాం. మైపాడు బీచ్ లో జలకన్య అసలు రాలేదని పైగా ఇదేమి మత్స్యకారులకు చిక్కలేదని.. ఇది కేవలం
ఫేక్ అని ఆక్వా కోపరేటివ్ మార్కెట్ డైరెక్టర్ అన్నారు. ఎవరో ఇలాంటి వీడియోలని కావాలనే క్రియేట్ చేస్తున్నారని.. జలకన్య రావడం ఫేక్ అని అటువంటి వాటిని అసలు నమ్మొద్దని చెబుతున్నారు.

అయితే ఇలాంటి ఫేక్ వీడియోలని ఏ మాత్రం నమ్మొద్దు. నిజానికి పది రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే దానిని సోషల్ మీడియా లో కూడా అప్లోడ్ చేశారు. కానీ ఇది మైపాడు బీచ్ లో చిక్కినట్లు ఆ వీడియో ని పోస్ట్ చేశారు. ఏది ఏమైనా ఫేక్ వార్తలను నమ్మి ఫార్వర్డ్ చేయడం మంచిది కాదు.