ఏం కుక్కరా బాబు.. ఓనర్ కే చుక్కలు చూపించింది..!

మామూలు చేజింగ్ కాదది. వీరలేవల్ చేజింగ్. ఏ సినిమాలో కూడా ఇటువంటి చేజింగ్ సీన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఓ కుక్క తన ఓనర్ నే ముప్పు తిప్పలు పెట్టింది. ఓ ఐదు నిమిషాల పాటు మనోడికి చుక్కలు చూపించింది. ఎందుకు, ఏమిటి, ఎలా.. అని తెలుసుకోవాలనుందా? పదండి.. ఇంకాస్త ముందుకెళ్దాం.

సహజంగా ఇంట్లో పెంచుకునే కుక్కలు అప్పుడప్పుడు కొన్ని చిలిపి పనులు చేస్తుంటాయి. దాంట్లో పెద్ద పట్టించుకోవడానికి ఏమీ ఉండదు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులను నోటితో పట్టుకొని తీసుకెళ్తుంటాయి. సేమ్ ఇలాగే ఓ కుక్క తన యజమానికి చెందిన గోప్రో కెమెరాను నోట్లో పెట్టుకొని పరుగు లంకించుకుంది. అరే.. నా కెమెరా ఏదీ అని అటూ ఇటూ చూసిన యజమాని చివరకు తన కెమెరాను కుక్క నోట కరుచుకొని తీసుకెళ్తుందని గమనించి దాని వెనుక పరిగెత్తడం ప్రారంభిస్తాడు. అరె.. ఎంత పరిగెత్తినా అది దొరకదే? ఆయనతో పాటు వాళ్లు పెంచుకుంటున్న మరో రెండు మూడు కుక్కలు కూడా దాన్ని చేజ్ చేశాయి. కాని ఏం లాభం. అది మాత్రం జెట్ స్పీడ్ లో పరిగెత్తి ఎవ్వరికీ దొరకకుండా ఇంటి చుట్టూ రెండు మూడు రౌండ్లు వేసింది.

అదంతా సరే కాని.. ఇప్పుడు ఈ స్టోరీ అంతా మాకు ఎందుకు చెబుతున్నారు అని అంటారా? అదే మరి.. పూర్తిగా చెప్పేదాక వినాలి. అది కెమెరా పట్టుకొని పరిగెత్తింది కదా? అది పరిగెత్తినప్పుడు ఆ కెమెరా ఆన్ లోనే ఉంది. అది మ్యాటర్. దీంతో ఆ శునకం పరిగెత్తినప్పుడు వీడియో రికార్డయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకే.. ఇప్పుడు ఆ వీడియోను మీరు కూడా చూసేసి వామ్మో రియల్ చేజింగ్ సీన్లు ఇలా ఉంటాయా? అని నోరెళ్లబెట్టండి. సరేనా.. ఇదిగో వీడియో.