గత మూడు రోజుల క్రితం తెలంగాణ లో వర్షాలు ప్రజలను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో వర్షపు నీరు అంతా రోడ్లపైకి రావడంతో పాటు.. కొన్ని చోట్ల ఇంటి లోకి వచ్చి ఇబ్బంది పెట్టాయి. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రానున్న మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా ఈ రోజు ఆదిలాబాద్,ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల్, నిర్మల్, ఖమ్మం, నల్గొండ , జనగాం, సిద్దిపేట,యదాద్రి, రంగారెడ్డి, భువనగిరి, హైదరాబాద్ మరియు మేడ్చల్ జిల్లాలలో భారీగా వర్షం పడే అవకాశం ఉందట.
ఈ వర్షం కూడా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో వర్షం పడుతుందట. దీనితో తెలంగాణ ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు చేపట్టడానికి సిద్దం అవుతోంది. ఇక ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని స్థానిక అధికారులు సలహా ఇస్తున్నారు. వర్షం పడి సమయంలో బయట ఉండద్దని సూచిస్తున్నారు.