ధనిక పేద అని తేడా లేకుండా అందరి దగ్గర ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఈ మధ్యకాలంలో ఫోన్లకు బాగా అలవాటు పడ్డారు. అందులోనూ కరోనా పీరియడ్ లో చాలామంది తల్లితండ్రులు దగ్గరుండి మరీ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు, టాబ్ లు కొనిచ్చారు. అయితే ఇపుడు పిల్లలకి ఫోన్లు వాడటం బాగా అలవాటు అయిపోయింది, అన్నం తినాలన్నా, ఏ పని చేయాలన్నా ఫోన్ ఇస్తేనే అన్నట్టుగా అయిపోయారు. తల్లితండ్రులు కూడా సరేలే అనుకొని ఇచ్చేస్తున్నారు.
అయితే ఫోన్లు వాడటం వలన మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరే పూర్తిగా ప్రమాదం లోకి నెట్టేస్తున్నారు అన్న విషయం తెలుసుకొని ఇకనైనా మేల్కోవడం అత్యవసరం. ఇప్పటికైనా మీ పిల్లలని ఫోన్ల విషయంలో కంట్రోల్ చేయకపోతే అనారోగ్య సమస్యలతో పాటుగా మానసిక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు .