సంగారెడ్డిలో జగ్గారెడ్డికి మళ్ళీ ఛాన్స్ ఉందా? కారుకు ఛాన్స్ ఉందా?

-

సంగారెడ్డి నియోజకవర్గం..అనగానే మొదట గుర్తొచ్చే పేరు జగ్గారెడ్డి..ఈ స్థానంలో చాలామంది ఎమ్మెల్యేలుగా గెలిచారు గాని..జగ్గారెడ్డి వేసిన ముద్ర మాత్రం ఎవరు వేయలేకపోయారు. గతంలో పి. రాంచంద్రారెడ్డి ఎక్కువసార్లు సంగారెడ్డి నుంచి గెలిచారు. ఆయన తర్వాత అక్కడ బాగా ఫేమస్ అయింది మాత్రం జగ్గారెడ్డి అని చెప్పవచ్చు. ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.

2004లో జగ్గారెడ్డి తొలిసారి బి‌ఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లోకి జంప్ కొట్టారు. ఇక 2009 ఎన్నికల్లో జగ్గారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో జగ్గారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి బి‌ఆర్‌ఎస్ చేతిలో ఓడిపోయారు. అయితే  ఆ వెంటనే జరిగిన మెదక్ పార్లమెంట్ ఉపఎన్నికలో జగ్గారెడ్డి బి‌జే‌పిలోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చేశారు.

ఇక 2018 ఎన్నికల్లో జగ్గారెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో నిలబడి విజయం సాధించారు. అక్కడ నుంచి ఆయన దూకుడుగా ముందుకెళుతున్నారు. ఇక ఆయన ప్రత్యర్ధులపై కంటే సొంత పార్టీ నేతలపైనే ఎక్కువ తిరుగుబాటు చేస్తూ వచ్చారు. దీంతో జగ్గారెడ్డి పార్టీ మారిపోతారనే ప్రచారం  వచ్చింది. కానీ ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేయడానికే రెడీ అవుతున్నారు. అయితే సంగారెడ్డిలో జగ్గారెడ్డికి బలం ఉంది..కానీ అదే సమయంలో బి‌ఆర్‌ఎస్ బలపడుతుంది.

అటు బి‌జే‌పి కూడా నిదానంగా పుంజుకుంటుంది. బి‌జే‌పి పుంజుకున్న సంగారెడ్డిలో ప్రధాన పోరు కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్ ల మధ్య జరగనుంది. అయితే జగ్గారెడ్డి నెక్స్ట్ పోటీ నుంచి తప్పుకుని తన వారసురాలుని బరిలో దింపే అవకాశాలు కూడా లేకపోలేదు. చూడాలి ఈ సారి సంగారెడ్డి పోరు రసవత్తరంగా ఉండేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news