ఫ్యాక్ట్ చెక్: ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి వస్తున్న అపాయట్మెంట్ లెటర్ నిజమేనా..? అప్లికేషన్ ఫీజు కట్టాలా..?

-

మనం సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త ని చూస్తూనే ఉంటాం. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. అలాంటి వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సింది మనమే. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం.

అందుకని తెలియని వాటికీ, అనుమానంగా అనిపించే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే మరి ఇక తాజాగా ఒక వార్త వచ్చింది. మరి అది నిజామా కాదా..? దానిని నమ్మచ్చా లేదా అనేది చూద్దాం. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎక్సైజ్ మినిస్ట్రీ తాజాగా ఒక అపాయింట్మెంట్ లెటర్ ని ఇచ్చారు.

ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ పోస్ట్ కి ఎంపికయ్యారని… అప్లికేషన్ ఫీజు చెల్లించాలని అందులో ఉంది. నిజంగా ఎక్సైజ్ మినిస్టరీ ఈ అపాయింట్మెంట్ లెటర్ ను జారీ చేసిందా ఉద్యోగస్తులు ఎంపిక చేసిందా..? ఫీజు కట్టాలా..? ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. నిజానికి ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఎక్సైజ్ మినిస్టరీ ఎలాంటి అపాయింట్మెంట్ లెటర్ ను జారీ చేయలేదు.

ఆ మెసేజ్ కనుక వచ్చిందంటే నమ్మకండి. పైగా అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించద్దు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఎలాంటి ఎక్సయిజ్ మినిస్ట్రీ లేదు ఇది కేవలం ఫేక్ వార్త మాత్రమే. అనవసరంగా ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మకండి. ఈ వార్తపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందించింది ఇందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పేసింది. కాబట్టి ఇలాంటి ఫేక్ వార్తల్ని నమ్మొద్దు అలానే వాటికి దూరంగా ఉంటేనే బెస్ట్.

Read more RELATED
Recommended to you

Latest news