స్ఫూర్తి: సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి.. ఛాయ్ బిజినెస్.. కట్ చేస్తే లక్షల్లో ఆదాయం..!

-

ప్రతి ఒక్కరికి జీవితంలో సక్సెస్ అవ్వాలనే ఉంటుంది. అనుకున్న ఎత్తుకి ఎదగాలని ఉంటుంది. కానీ నిజానికి అందరికీ అంత అదృష్టం ఉండదు. చిన్న చిన్న ఆటంకాలు రావడం లేదంటే ఏదైనా తప్పులు జరగటం, కష్ట పడకపోవడం ఇలాంటి వాటి వల్ల అనుకున్నది సాధించలేము అయితే నిజానికి వాళ్ల మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. కష్టపడితే జీవితంలో ఏమైనా సాధించడానికి అవుతుంది.

ఇది ఇలా ఉంటే కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఆ తర్వాత చాలా అవస్థలు పడ్డారు. కానీ గణేష్ మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ఛాయ్ బిజినెస్ ని మొదలు పెట్టారు. ప్రతినెల లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన గణేష్ ఇంజినీరింగ్ ని 2019లో పాసయ్యారు. మంచి కంపెనీలో జాబ్ కూడా వచ్చింది. కానీ ఆ జాబ్ అతనికి ఎటువంటి తృప్తి ఇవ్వలేదు.

దీనితో బిజినెస్ చేయాలని అనుకున్నారు. వెంటనే తన తండ్రి నుంచి ఆరు లక్షలు తీసుకుని అతను రైల్వే స్టేషన్ లో చిన్న ఛాయ్ షాప్ ని మొదలు పెట్టారు. దీంతో అతని ఛాయ్ కి ఆదరణ బాగా పెరిగింది. బిజినెస్ కూడా బాగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. మహారాష్ట్ర గుజరాత్ కలిపి ప్రస్తుతం ఏడు ఔట్ లెట్స్ ని మొదలు పెట్టారు. ఒక్కో దాంట్లో 8000 లాభం వస్తుంది.

అంటే నెలకి రెండున్నర లక్షల పైగా సంపాదిస్తున్నారు. మొత్తం ఏడు కలిపి నెలకి 17 లక్షల ఆదాయం వస్తుంది. దేశవ్యాప్తంగా తన ఛాయ్ బిజినెస్ ని 1000 నగరాలకి విస్తరింప చేయాలని అతను చూస్తున్నారు. ప్రతి ఔట్లెట్లలో 20కిపైగా వెరైటీ చేయాలని తయారు చేస్తున్నారు. ఛాయ్ తో పాటుగా కుకీస్, కూల్ డ్రింక్ వంటివి కూడా అమ్ముతున్నారు. ఇలా నెలకు లక్షల్లో ఆదాయం ని సంపాదిస్తున్నారు గణేష్.

Read more RELATED
Recommended to you

Latest news