Sekhar Master: పవన్ కల్యాణ్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా: శేఖర్ మాస్టర్

-

టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ ప్రజెంట్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో పాటలను కొరియోగ్రఫీ చేయడానికి తమిళనాట నుంచి కొరియోగ్రాఫర్స్ వచ్చేవారు. ప్రభుదేవా, లారెన్స్ తదితరులు వచ్చి స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేసే వారు. ప్రజెంట్ మన తెలుగు కొరియోగ్రాఫర్సే తమిళనాడుకు వెళ్లొస్తున్నారు. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ తదితరులు టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్స్ గా దూసుకుపోతున్నారు.

శేఖర్ మాస్టర్ ‘ఢీ’ డ్యాన్స్ షో జడ్జిగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం. కాగా, ఈయన మెగా హీరోలందరి సినిమాల్లో సాంగ్స్ కు కొరియోగ్రఫీ చేశారు. కాగా, తాజా ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను మెగా హీరోలందరితో సినిమాలు చేశానని, కానీ, పవన్ కల్యాణ్ సినిమా చేయలేదని చెప్పుకొచ్చారు.

నిజానికి తనకు ‘భీమ్లా నాయక్’ సినిమా కోసం పిలుపు వచ్చిందని, కానీ అప్పుడు తాను వేరే సినిమాల షూటింగ్స్ లో ఉన్నానని చెప్పాడు. అలా తన డేట్స్ లాక్ అయిన నేపథ్యంలో చాన్స్ మిస్ అయిందన్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు శేఖర్ మాస్టర్. చూడాలి మరి.. భవిష్యత్తులో పవన్ కల్యాణ్ తో శేఖర్ మాస్టర్ వర్క్ చేస్తాడో లేదో..

‘ఆచార్య’ చిత్రంలో ‘నీలాంబరి’ సాంగ్ తో పాటు ‘భలే భలే బంజారా’ సాంగ్ ను శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. తండ్రీ తనయులు చిరంజీవి- రామ్ చరణ్ లకు డ్యాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు శేఖర్ మాస్టర్. సూపర్ స్టార్ మహేశ్ బాబు‘సర్కారు వారి పాట’ చిత్రంలోని ‘కళావతి’ సాంగ్ కు కూడా శేఖర్ మాస్టరే కొరియోగ్రాఫర్.

 

Read more RELATED
Recommended to you

Latest news