కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ప్రకటన… తెలంగాణలో రైస్ మిల్లులను తనిఖీ చేయాలని ఎఫ్సీఐకి ఆదేశం

-

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలోని రైస్ మిల్లులతో తనిఖీలు చేయాలని ఎఫ్సీఐని ఆదేశించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని రైస్ మిల్లుల్లో ఉండాల్సిన నిల్వలు ఉండటం లేవని, ఎఫ్సీఐకి చెందిన అధికారులు వాటిని గుర్తించి ఎక్కడెక్కడ బియ్యం ఎందుకు ఉండటం లేదు… కొరత ఎందుకు వస్తుందనే విషయంపై తనిఖీలు చేశామని… ఇప్పటి వరకు 40 రైస్ మిల్లులను తనిఖీ చేస్తే అందులో 4,53,896 బస్తాల బియ్యం తక్కువగా ఉందని తేలిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ బియ్యం ఏమయ్యాయో స్పష్టత కావాలని కిషన్ రెడ్డి అన్నారు.  రైస్ మిల్లలుకు, కేంద్ర ప్రభుత్వాలకు నేరుగా ఒప్పందం ఉండని… రాష్ట్ర ప్రభుత్వానికి రైస్ మిల్లులకు మాత్రమే అగ్రిమెంట్ ఉంటుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మధ్య ఓ పార్టీ నాయకుడు దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరారని.. అయితే దీనికి అధికారం లేదని వెల్లడించారు. రైస్ మిల్లుల నుంచి రాష్ట్రం తీసుకువచ్చి.. కేంద్రానికి ఇస్తుందని దీనిపై సీబీఐ దర్యాప్తు చేసే అధికారం ఉండని అన్నారు. సివిల్ సప్లై డిపార్ట్ మెంట్, ఎఫ్సీఐ ద్వారా తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణలో ఉన్న అన్ని రైస్ మిల్లులను తనిఖీ చేయాలని ఆదేశం ఇచ్చామని.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో మాకు తెలియజేయాలని లేఖ రాశామని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news