జెలసీతో రిలేషన్స్ పెరుగుతాయ్.. తాజా అధ్యయనం..

-

ఏ విషయమైనా ఎక్కువగా స్నేహితులతోనే డిస్కస్ చేస్తుంటాం. పేరెంట్స్ దగ్గర చెప్పుకోనివి కూడా స్నేహితుల దగ్గర ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేస్తాం. బాధపడినప్పుడు ఓదార్చేవాడు ఫ్రెండే. మన ఆనందంలో పాలు పంచుకునేవాడు ఫ్రెండే. మన బాధల్ని తన బాధలుగా భావించి బాధ్యతని మీద వేసుకునేవాడు ఫ్రెండే. కష్టంలో మనతో ఉండేవాడు ఫ్రెండే ఇలా ఫ్రెండ్ షిప్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు.

ఫ్రెండ్ షిప్ సరిగా నిలబడాలంటే ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలని అంటుంటారు. అలాగే ఫ్రెండ్ షిప్ ని నశింపజేసేవి అసూయ, ఈర్ష్య, కుళ్ళు అంటారు. అసూయ, కుళ్ళు, ఈర్ష్య అనేవి మనుషుల బంధాన్ని తగ్గిస్తాయని, వాటివల్ల మానసిక ఆరోగ్యం దూరమవడంతో పాటు స్నేహం పాడవుతుందని చెప్పుకుంటారు. కానీ జెలసీ.. అదే అసూయ మనుషుల మధ్య బంధాలని పెంచుతుందని తాజా అధ్యయనం చెబుతోంది.

అదేంటని ఆశ్చర్యపోతున్నారా.. అవును నిజమే. అసూయ  ఫ్రెండ్ షిప్ ని మరింత స్ట్రాంగ్ గా చేస్తుందట. ఇద్దరు ఫ్రెండ్స్ స్నేహంగా ఉంటున్నారనుకుందాం. అలాంటి టైమ్ లో అందులో ఒక ఫ్రెండ్, కొత్త పరిచయస్తుడితో స్నేహంగా ఉంటే, అప్పుడు తన తోటి ఫ్రెండ్ ఈర్ష్య పడుతుంటాడు. ఎవరో కొత్త వ్యక్తితో స్నేహం పెంచుకోవడం తన ఫ్రెండ్ కి ఇష్టం ఉండదు. ఏదైనా తనతో చెప్పుకునే ఫ్రెండ్ మరొకరితో తన భావాలు పంచుకోవడం జీర్ణించుకోడు. పరిచయస్తుడితో స్నేహం కారణంగా తనకి దూరం అవడం తీసుకోడు. తద్వారా జెలసీ పెరుగుతుంది.

అపుడు ఆ ఫ్రెండ్, తన ఫ్రెండ్ తో మరింత స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. బంధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన ఫ్రండ్ తో ఇంకా బాగుండడానికి ట్రై చేస్తాడు. సో ఈ విధంగా జెలసీ కూడా ఫ్రెండ్ షిప్ ని మరింత స్ట్రాంగ్ చేయడానికి పనికివస్తుందని ఓక్లాహోమా యూనివర్సిటీ అభిప్రాయపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news