సమాజంలో నేడు స్థాయి బేధాలు లేకుండా స్త్రీ అయితే చాలు మృగాళ్లు ఎగబడి మానభంగానికి పాల్పడుతున్నారు. కొన్ని ఘటనలు బయట పడుతుంటే, చాలా వరకు ఘటనలు పరువు పోతుందని చెప్పుకోకుండా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. అయితే తాజాగా ఒక విషయం మాత్రం సంచలనానికి దారితీస్తోంది అని చెప్పాలి. కేరళ రాష్ట్రము పతనంతిట్ట జిల్లా కలెక్టర్ గా ఉన్న దివ్య ఎస్ అయ్యర్ తన వ్యక్తిగత విషయాన్ని బహిర్గతం చేసింది. ఆమె చెప్పిన సమాచారం ప్రకారం ఆమె ఆరేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆమెను ఎంతో ప్రేమగా దగ్గరకు పిలిచి బట్టలు విప్పారట.
అయితే ఆమె వారి చేష్టలకు భయంతో పారిపోయిందట. ఆ తరువాత దివ్య అయ్యర్ తల్లితండ్రుల సహాయంతో ఆ దుర్ఘటన నుండి బయటపడిందట. ఈ సంఘటనను తలుచుకుని ఆమె తనకు జరిగిన ఒక చెడు అనుభవాన్ని తలుచుకుని బాధపడింది. అయితే ఈమె ఇప్పుడు ఈ సంఘటన గురించి చెప్పడానికి కారణం పిల్లలకు తల్లితండ్రులు గుడ్ మరియు బ్యాడ్ టచ్ ల గురించి చెప్పాలని తెలిపింది.