అయ్యో.. సిస్టర్ పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ ఇబ్బందిగా ఉందా.. ఈ చిట్కాలతో రిజల్ట్ పక్కా..!  

-

స్ట్రెచ్ మార్క్స్.. ఇవి ఎంత ఇబ్బంది పెడతాయో.. మార్క్స్ ఉన్న అందరికీ తెలుసు.. బరువు తగ్గిన వారికి, పిల్లలు పుట్టాక ఆ తల్లులకు పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ శాశ్వతంగా ఉండిపోతాయి. అయితే ఇవి మనకు నచ్చిన వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవాలనప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటాయి. కనిపిస్తే.. అంత మంచిగా ఉండదు. వీటిని పోగొట్టుకోవడానికి చాలా రకాలు క్రీమ్స్ కూడా వాడుతుంటారు. అయితే ఇంట్లోనే నాచురల్గా శాశ్వతంగా ఈ మారకలకు మంగళం పాడేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఎలానో చూసేద్దామా..!

కోకోవా బటర్

స్ర్టెచ్ మార్క్స్ పోగొట్టేలా పనిచేసే కోకోవా బటర్ చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తుంది. రాత్రి పూట కోకోవా బటర్ మసాజే చేస్తుంటే.. కొంతకాలానికి అవి మాయమవ్వటం ఖాయం.

కీరా-నిమ్మ

నిమ్మరసంలోని సహజసిద్ధమైన ఎసిడిటీతో చర్మం రంగు పల్చబడుతుంది. చర్మం తాజాగా ఉంచే కీరా దోసకాయ గుజ్జును నిమ్మరసంతో కలిపి ప్యాక్ వేసుకుంటే స్ర్టెచ్ మార్క్స్ తగ్గుతాయి. ఇలా 10 నిమిషాలపాటు కొన్ని రోజులు చేస్తే తేడా మీరే చూస్తారు. నిమ్మ సహజసిద్ధమైన బ్లీచ్ కనుక చర్మంపై ఉన్న చారల రంగును ఇది తగ్గిస్తుంది.

అలోవెరా

కలబంద చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలకు మంచి పరిష్కారం. కాంతివంతమైన చర్మం కోసం సరికొత్త స్కిన్ టిష్యూలను డెవలప్ అయ్యేలా చేసే శక్తి ఉన్న కలబందకు ఉంది. పొట్టపై చారలకు విరుగుడుగా పనిచేస్తుంది. స్ర్టెచ్ మార్క్స్ ఉన్నచోట కలబంద గుజ్జును లేదా చిన్న ముక్కను సున్నితంగా రుద్ది ఓ అరగంటపాటు అలా ఆరనిచ్చి, తరువాత కడగండి. ఇలా తరచూ చేస్తే శాశ్వతంగా స్ర్టెచ్ మార్క్స్ పోతాయి. లేదా అవి చాలా పలుచబడి చర్మంలో కలిసిపోతాయి.

యాప్రికాట్ మాస్క్-ఆయిల్

మంచి స్క్రబ్ గా పనిచేసే యాప్రికాట్స్ స్ర్టెచ్ మార్క్స్ పై అద్భుతంగా పనిచేస్తుంది. 2 లేదా 3 యాప్రికాట్లను తీసుకోండి.. వాటిని కట్ చేసి.. అందులోని గింజను తీసి.. పండును మాత్రం పేస్ట్ చేసి చారలు ఉన్నచోట ప్యాక్ వేసుకోండి. ప్యూర్ ఆప్రికాట్ ఆయిల్ లో ఉన్న సుగుణాలు చర్మంపై సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ నూనెను నిమ్మ రసంతో కలిపి వాడితే రిజల్ట్ ఇంకా బాగుంటుంది.

ఆముదం నూనె

సాధరణంగా.. ఆముదం అంటే.. హెయిర్ కు మంచిదని మనకు తెలుసు.. చర్మంపై రాసినప్పుడు కూడా చర్మానికి అచ్చం ఇవే వస్తాయి. మంచి ఫలితం కోసం గానుగలో తీసిన స్వచ్ఛమైన ఆముదం నూనెను స్ట్రెచ్ మార్క్స్ ఉన్నచోట రాయండి. ఇలా కొన్ని రోజులపాటు ఓపికగా చేస్తే ఫలితం ఉంటుంది.

ఈ ప్యాక్ తో కూడా మంచి రిజల్ట్..

2 కోడి గుడ్లలోని పచ్చ సొనలను బాగా గిలక్కొట్టి.. ఒక నిమ్మకాయ రసం, 2 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, 2 టేబుల్ స్పూన్ల ఆల్మండ్ పేస్ట్, తగినంత పాలు వేసి నున్నని పేస్టులా చేసుకోండి. ఇది స్ట్రెచ్ మార్క్స్ పై అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా రోజుమార్చి రోజు చేస్తే స్ట్రెచ్ మార్క్స్ శాశ్వతంగా మాయమవుతాయి.
అయితే ఇది కేవలం ఒకటి రెండు సార్లు చేస్తే సరిపోదు. ఇవి శాశ్వతంగా పోవాలంటే.. ఓపిగ్గా తరచూ చేస్తుండాలి. రెండు సార్లు చేసి.. అరే ఏం ఫలితం లేదు అని వదిలేస్తే అవి ఎప్పటికీ మీతోనే ఉంటాయి మరీ.!

Read more RELATED
Recommended to you

Latest news