కరీంనగర్ లో ప్రత్యక్షమైన “పుష్ప” విలన్.. సెల్ఫీల కోసం ఎగబడుతున్న స్థానికులు..

-

మిలో చాలామంది పుష్ప సినిమా చూసే ఉంటారు. అందులో విలన్ క్యారెక్టర్ పోషించిన పోలీస్ “బాణావర్ సింగ్ శాకావత్” ఏ క్యారెక్టర్ గురించి తెలిసే ఉంటది. పార్టీ లేదా పుష్ప అంటూ తనదైన డైలాగ్ లతో సినిమాను హోరెతించాడు ప్రముఖ కేరళ నటుడు ఫహద్ ఫాజిల్. అయితే అతను ఇప్పుడు ప్రత్యక్షమైనాడు .అదేంటి అనుకుంటున్నారా.. అతను నిజమైన సీనిమా విలన్ కాదు.

 

 

 

 

ఇతని పేరు శ్రీనివాస్.. కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ట్రాఫిక్ కానిస్టేబుల్.. తోటి సహచరులు ముద్దుగా బుల్లెట్ శ్రీను అని పిలుస్తారు. మొదటి నుండి కూడా శ్రీనివాస్ సినిమా హీరోల హెయిర్ స్టైల్ మెయింటేన్ చేసేవాడు. అయితే పుష్ప సినిమా రిలీజ్ ముందు వరకు అతన్ని ఎవరు పట్టించుకునే వారు కాదు. కానీ పుష్ప సినిమా రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టడంతో అందులోని పోలీస్ పాత్రను, ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు. పుష్ప సినిమాలోని విలన్ లాగే ఉండటం వాళ్ళ అతనితో సెల్ఫీలు, ఫోటోలు దిగుతున్నారు. ఇలా ప్రజలు తనతో సెల్ఫీలు దిగడం తనకి చాల ఆనందగా ఉంది అంటున్నాడు బుల్లెట్ శ్రీను.

Read more RELATED
Recommended to you

Latest news