2024 ఎన్నికల్లో రెండో సారి సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని… అప్పుడు చంద్రబాబు, రామోజీ, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడులు గుక్కపట్టి ఏడ్వక తప్పదని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఎవరెన్ని విష ప్రచారాలు చేసినా, పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు అంబటి రాంబాబు.
చంద్రబాబు తప్పిదం వల్ల ఏర్పడిన గోతులను పూడ్చటానికి రూ.800 కోట్లు.. రెండు కాఫర్ డ్యామ్ల మధ్య నీటిని తోడేయడానికి రూ.2,100 కోట్లు ఖర్చు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పాపం చంద్రబాబుది కాదా? అని అంబటి రాంబాబు నిలదీశారు.
చంద్రబాబు చేసిన తప్పిదాన్ని జాతీయ, అంతర్జాతీయ నిపుణులను సంప్రదించి సరిచేస్తున్నాం. ఢిల్లీ-ఐఐటీ రిటైర్డు డైరెక్టర్ వీఎస్ రాజు నేతృత్వంలోని ఎనిమిది మంది నిపుణుల బృందం శుక్ర, శనివారాల్లో పోలవరాన్ని పరిశీలించింది. వారి సూచన మేరకు పనులు చేపడతామన్నారు. ఎగువ కాఫర్డ్యామ్ను 42.5 మీటర్లకు పూర్తిచేసి 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి స్పిల్ వే మీదుగా 6.1 కి.మీల పొడవున గోదావరి ప్రవాహాన్ని గతేడాది జూన్ 11న మళ్లించారు. చంద్రబాబు తప్పిదం చేసి ఉండకపోయుంటే ఈ పాటికే పోలవరం పూర్తయ్యేదన్నారు అంబటి రాంబాబు.