చిమ చిన్నదే కాని.. 10 లక్షల విలువైన వజ్రాన్ని దొంగలించేసింది..!

నమ్మం.. అస్సలే నమ్మం. మీరు ఏది చెబితే అది నమ్మడానికి మేమేం పిచ్చోళ్లం కాదు అంటారా? దీనికోసం మీరు పిచ్చోళ్లేం కావాల్సిన అవసరం లేదు కాని.. ముందు ఈ వీడియో చూడండి తర్వాత మాట్లాడుకుందాం.

చూశారుగా వీడియో ఇప్పుడైనా నమ్ముతారా? చీమే కాని ఏకంగా 10 లక్షల రూపాయల విలువైన వజ్రాన్ని దొంగలించింది. అతి కష్టం మీద దాన్ని ఎలా మోసుకెళ్తున్నదో వీడియోలో చూశారుగా. ఓ జ్యుయెలరీ షాపులో ఆ చీమ ఈ తుంటరి పని చేసింది. ఏదైనా తినేది అనుకుందో.. లేదంటే తన గర్ల్ ఫ్రెండ్ ను ఫిదా చేద్దామనుకుందో ఏమో.. కాని ఆ చీమ వజ్రాన్ని దొంగలించే వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది.