మాజీ ప్రియుడిపై కక్షతో… ఫేక్ పెండ్లికొడుకు తో వెడ్డింగ్ ఫోటో షూట్…!

-

జర్మనీకి చెందిన వీలర్డ్, 24 వయసు ఉండే స్టూడెంట్ 2019లో తన బాయ్ ఫ్రెండ్ తో ఆమెకి బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిన మూడు నెలలకి వీలర్డ్ తన బాయ్ ఫ్రెండ్ పైన రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంది. ఈ మధ్య వివాహం అయినట్లు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని నమ్మించాలని ఒక ఫేక్ పెండ్లి కొడుకు తో ఫోటో షూట్ చేసింది. ఇలా ఆమె ఎప్పుడో జరిగిన విషయాలని చెప్పుకొచ్చింది.

ఆమె ఒక వెడ్డింగ్ డ్రెస్ కొనుక్కుని, ఫేక్ పెళ్ళి కొడుకుని తీసుకు వచ్చి వెడ్డింగ్ ఫోటో షూట్ చేయడం మొదలుపెట్టింది. ఈమె ఫేక్ వెడ్డింగ్ షూట్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టింది. ఈ ఫోటోలని ఆమె తన సోషల్ మీడియా లో కూడా షేర్ చేయడం జరిగింది.

తన పాత ప్రియుడి అటెన్షన్ రాబట్టాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫోటోలని చూసిన మాజీ ప్రియుడు తన ఇంటికి వచ్చి తనతో మాట్లాడాలి అని కూడా అన్నాడు. అప్పుడు ఆమె నాకు ఇష్టం లేదని చెప్పింది.

ఆ తర్వాత ఆమె తన ని బ్లాక్ చేసి ప్రొఫైల్ ఎకౌంట్ ని ప్రైవేట్ గా పెట్టుకుని ఆ ఫోటోలను కూడా తొలగించింది. వీలర్డ్ ఇప్పుడు సింగిల్ గా ఉంది. తానూ ఇప్పుడు సంతోషంగా ఉన్నట్లు చెప్పింది. ఈ విషయాలన్నీ తన సోషల్ మీడియాలో వీలర్డ్ షేర్ చేసుకుంటే రెండు మిలియన్ల మంది చూశారు.

ఆ వీడియోని ఆమె స్క్రీన్ షాట్స్ కింద కూడా పెట్టింది. ఫేక్ వెడ్డింగ్ షూట్ తర్వాత తన మాజీ ప్రియుడు ఏం చెప్పాడు అనేది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టింది. చూసిన వీక్షకులు ఈమె సైకోటిక్ అని కొందరైతే జీనియస్ అని పెట్టారు. ఇంత క్రేజీగా ఉంటారా అని కూడా కొందరు కామెంట్ చేశారు. అయితే ఈ వీడియో చేయడం వల్ల 5000 మంది తనని ఫాలో అవుతున్నారు అని ఆమె చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news