ఏటీఎంలో డబ్బులకు బదులు గణేశ్ ప్రసాదం!

-

ఏటీఎం అంటే ఏంటి.. ఎనీ టైమ్ మనీ అంటారా? అవును.. కరెక్టే కాని.. ఇప్పుడు గణేశ్ నవరాత్రులు జరుగుతున్నాయి కదా. అందుకే.. ఏటీఎం అంటే ఎనీ టైమ్ మోదక్.. అన్నమాట. మోదక్ అంటే తెలుసు కదా.. వినాయకుడికి ఇష్టమైనవి అవి. అందుకే గణేశుడికి ఇష్టమైన మోదక్ లతో కూడిన ఓ ఏటీఎంను తయారు చేశాడు పూణేకు చెందిన ఓ వ్యక్తి. పూణేలోని శంకర్ నగర్ లో వినాయక నవరాత్రుల సందర్భంగా ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు.

సంజీవ్ కులకర్ణీ.. ఈ ఏటీఎం సృష్టికర్త. ఏటీఎం లోపల మోదక్ లను పెట్టి వాటి కోసం సపరేట్ కార్డును డిజైన్ చేశాడు. ఆ కార్డును ఏటీఎం దగ్గర పెట్టగానే మోదక్ ప్రసాదం బయటికి వస్తుందన్నమాట. సేమ్ టు సేమ్ డబ్బులు వచ్చే ఏటీఎంలాగానే ఉండే ఈ ఏటీఏం దగ్గర గణేశ్ భక్తులు మోదక్ కోసం క్యూ కడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news