జనసేన పార్టీ ఎన్నికల గుర్తు వచ్చేసింది. గాజు గ్లాసు వాళ్ల ఎన్నికల గుర్తు. 2019లో ఏపీలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ ఇదే గుర్తుతో పోటీ చేయనున్నది. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో ఇదే గుర్తుతో పోటీ చేయనున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది.
2014, మార్చి 14న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. కాకపోతే ఇప్పటి వరకు వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన… టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం నిర్వహించింది. తర్వాత టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతును ఉపసంహరించుకున్న పవన్ కళ్యాణ్.. సొంతంగా తన క్యాడర్ ను అభివృద్ధి చేసుకున్నారు. అయితే.. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మాత్రం జనసేన పోటీ చేయలేదు.