
అది ఇటలీలోని పాంపీ సిటీ. ఇటీవల ఆర్కియాలజీ సైంటిస్టులు ఓ ప్రాంతంలో తవ్వకాలు జరుపగా… షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద గుర్రం అస్తిపంజరం వాళ్ల తవ్వకాల్లో బయటపడింది. అది పూర్తిగా గడ్డకట్టుకుపోయి ఓ శిలాజంలా మారిపోయింది. అది ఇప్పటి గుర్రం కాదు. దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం గుర్రం. క్రీశ 79 లో అక్కడ ఓ అగ్నిపర్వతం బద్దలయిందట. అగ్ని పర్వతం నుంచి వెలువడిన లావా వల్ల ఆ ప్రాంతంలోని జీవులన్నీ మృత్యువాత పడ్డాయి. తర్వాత వాటి అవశేషాలు గడ్డకట్టుకుపోయి భూమిలో అలాగే నిక్షిప్తమయి ఉన్నాయన్నమాట. చాలా గుర్రాల అవశేషాలు అధికారులు తవ్వకాల్లో బయటికి తీశారు.
వేరే ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లోనూ గడ్డకట్టుకుపోయి ఉన్న మనుషుల మృతదేహాలు కనిపించాయని అధికారులు వెల్లడించారు. అప్పట్లో జరిగిన ఊచకోతలో వీళ్లంతా మృతిచెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు.








