ట్విట్టర్ లో ట్రెండింగ్ లో #BoycottSurfExcel హ్యాష్ టాగ్.. ఏం జరిగింది?

-

ఈ వివాదంపై స్పందించిన హిందుస్థాన్ కంపెనీ.. ఆ యాడ్ హిందూ, ముస్లింల ఐక్యతను చాటేలా ఉందని.. అందులో హిందువులను ఇబ్బంది పెట్టే ఎటువంటి అభ్యంతకర సన్నివేశాలు లేవని… హిందువులు కలిసి మెలిసి పండుగలు చేసుకుంటారని.. వాళ్లు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టరని చెప్పడమే ఆ యాడ్ ఉద్దేశమని కంపెనీ తెలిపింది.

సర్ఫ్ ఎక్సెల్.. ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా ఉండే సర్ఫే ఇది. అయితే.. ఈరోజుల్లో వినియోగదారులను ఆకర్షించాలంటే ఎన్నో రకాల మార్కెటింగ్ ట్రిక్స్ ను ఫాలో అవ్వాలి. వినియోగదారులను రీచ్ అవడానికి ఎన్నో ఎత్తులు వేయాలి. వాళ్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించాలి. వాళ్ల నోట్లో ఎప్పుడూ నానుతుండాలి. అప్పుడే ఏ ప్రాడక్ట్ కైనా గిరాకీ.

boycottsurfexcel hashtag trending in twitter do you know what happened

అటువంటి వాటిలో భాగంగా.. చాలా కంపెనీలను తమ ప్రాడక్ట్ లకు సంబంధించిన యాడ్స్ ను రూపొందించి వాటిని యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వదులుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు ఆ వీడియోలకు ఆకర్షితులై వాటిని కొంటారని ఆశ.

అదే పద్ధతిని ఫాలో అయి ఇదివరకు కుంభమేళాపై ఓ యాడ్ చేసి ఓవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు ఎదుర్కొన్న హిందుస్థాన్ యూనీ లివర్ కంపెనీ.. తాజాగా తన మరో ప్రాడక్ట్ సర్ఫ్ ఎక్సెల్ యాప్ పై మాత్రం నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది.

త్వరలో హోలీ రాబోతున్నది కదా. దాని మీద యడ్ ను రూపొందించింది. అయితే.. ఆ యాడ్ లో హిందువుల మనోభావాలను కించపరిచారంటూ ట్విట్టర్ లో #BoycottSurfExcel హాష్ టాగ్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్ఫ్ ఎక్సెల్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.

అసలు యాడ్ లో ఏముంది..

అవును.. అసలు ఆ యాడ్ లో ఏముంది అంటారా? మీరు ఓసారి ఆ యాడ్ ను చూడండి. అందులో మీకు ఏం తప్పు అనిపించిందో చెప్పండి.

చూశారుగా.. అందులో మీకేమన్నా తప్పు అనిపించిందా? హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందా ఆ యాడ్? హిందువులు మరకలు పూసుకుంటుంటే… ముస్లింలు మాత్రం స్వచ్ఛంగా ఉంటున్నారా?.. తమ మనోభావాలను ఇలా దెబ్బతీస్తారా? సర్ఫ్ ఎక్సెల్ ను బాయ్ కాట్ చేయాల్సిందే.. అంటూ హిందుత్వ వాదులు ట్విట్టర్ లో ఆ హ్యాష్ టాగ్ తో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వివాదంపై స్పందించిన హిందుస్థాన్ కంపెనీ.. ఆ యాడ్ హిందూ, ముస్లింల ఐక్యతను చాటేలా ఉందని.. అందులో హిందువులను ఇబ్బంది పెట్టే ఎటువంటి అభ్యంతకర సన్నివేశాలు లేవని… హిందువులు కలిసి మెలిసి పండుగలు చేసుకుంటారని.. వాళ్లు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టరని చెప్పడమే ఆ యాడ్ ఉద్దేశమని కంపెనీ తెలిపింది. అయినప్పటికీ.. నెటిజన్లు మాత్రం ఊరుకోవడం లేదు. దానిపై దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. ఇదివరకు కూడా వివాదస్పద యాడ్స్ ను తీసి వార్తల్లోకెక్కింది హిందుస్థాన్ కంపెనీ. తాజాగా ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. చూద్దాం.. ఈ వివాదం ఎంత దూరం పోతుందో.

Read more RELATED
Recommended to you

Latest news