రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన కోడి.. 34 మందిపై కేసు

-

కోడి చేసిన పని పాత కక్షలనులేపింది… రెండు కుటుంబాలు తీవ్రంగా కొట్టుకున్నాయి. అయితే.. వాళ్లు కొట్టుకుంటుంటే.. ఊళ్లో వాళ్లు చూస్తూ ఊరుకోరు కదా. వాళ్లను ఆపుదామని వెళ్లారు.

ఓ కోడి ఏం చేయగలుగుతుంది. ఏం చేయలేదు. దాన్నే మనం కోసుకొని కూరొండుకొని తినేస్తాం.. అంటారా? అయితే మీరు కోడికూరలో కాలేసినట్టే. ఎందుకంటే.. ఓ కోడి రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. ఆ చిచ్చు తర్వాత ఊరు ప్రజలంతా షాకయ్యేలా చేసింది. దీంతో ఆ ఊళ్లోని 34 మందిపై కేసులు నమోదయ్యేలా చేసింది. ఏంటో.. కోడి చిచ్చు పెట్టడమేందని ఆశ్చర్యపోతున్నారా? అయితే మనం ఓసారి కర్నాటక వెళ్లాల్సిందే.

cock raised dispute between two families in karnataka

కర్నాటకలోని రాయచూర్‌కు సమీపంలో ఉన్న యురగేనా పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజనగేరా అనే గ్రామంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నది. అదే గ్రామానికి చెందిన తిమ్మప్ప, నరసప్ప బలప్ప బంధువులు. అయితే.. వీళ్ల మధ్య ఎప్పటి నుంచో గెట్టు పంచాయితీ నడుస్తోంది. దీంతో అదును కోసం చూస్తున్న వీళ్లకు కోడి చేసిన పని పాత కక్షలను మళ్లీ లేపింది. ఇంతకీ కోడి ఏం పని చేసిందంటారా? ఒకరి కోడి మరొకరి ఇంటికి పోయి.. వాళ్ల ఇంట్లో ఉన్న దిబ్బకుప్పను తన కాలితో కెలికిందట. అంతే అదును దొరికిందనుకున్నారో ఏమో. మళ్లీ లొల్లి పెట్టుకోవడం ప్రారంభించారు. రెండు కుటుంబాలు తీవ్రంగా కొట్టుకున్నాయి. అయితే.. వాళ్లు కొట్టుకుంటుంటే.. ఊళ్లో వాళ్లు చూస్తూ ఊరుకోరు కదా. వాళ్లను ఆపుదామని వెళ్లారు.



కానీ.. వాళ్లను కూడా చితక్కొట్టారు. దీంతో 9 మందికి దాకా గాయాలయ్యాయి. వాళ్లను చితక్కొట్టి పక్కన పడేసి కత్తులతో పొడుచుకునేందుకు రెడీ అయ్యారు. ఇదేదో సీరియస్ వ్యవహారం అయ్యేట్టుందని… గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు కుటుంబాలకు సర్దిచెప్పారు.

అయినప్పటికీ వాళ్లు మళ్లీ కొట్టుకుంటారని భావించిన పోలీసులు.. యరగేరా పోలీసులు.. ఆ రెండు కుటుంబాలకు చెందిన వారితో పాటు మొత్తం 34 మందికి కేసు నమోదు చేశారు. మళ్లీ గొడవలు జరగకుండా ఉండేందుకే వాళ్లపై కేసు నమోదు చేశామని.. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. గొడవ ఆపుదామని పోయిన వాళ్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారని గ్రామస్తులు వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news