క్రేజీ డ్యాన్సర్ ‘సప్నా చౌదరి’ కాంగ్రెస్‌లో చేరిందా? అసలు ఎవరీమె?

నైనోన్ మేన్ సప్నా.. సప్నొ మె సజనా.. అంటూ కుర్రకారు గుండెల్లో గుబులు లేపుతుంది ఈ సుందరి.. తను డ్యాన్స్ చేసిందింటే కుర్రకారుకు మతిపోవాల్సిందే..

క్రేజీ డ్యాన్సర్ కమ్ సింగర్ సప్నా చౌదరి మీకు తెలుసా? స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈమె గురించి తెలిసే ఉంటుంది. ఈమెది హర్యానా. అక్కడ చాలా ఫేమస్ డ్యాన్సర్. మొబైల్‌లో వచ్చే ఫన్నీ యాప్స్ ఉంటాయి కదా. వాటిలో వెతికితే ఈమె డ్యాన్స్ వీడియోలో దర్శనమిస్తాయి. సోషల్ మీడియాలోనూ ఈమె డ్యాన్స్ వీడియోలకు కొదవేలదు. సప్న డ్యాన్స్ షో అంటే చాలు.. కుర్రాళ్లు ఎగేసుకుంటూ అక్కడ వాలిపోతారు. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మీకు మూర్చ రావాల్సిందే.

అంత క్రేజ్ ఉన్న వాళ్లను పార్టీలో చేర్చుకోవాలని ఎవరైనా అనుకుంటారు. వాళ్ల ఫ్యాన్స్ ఓట్లన్నా పడకపోతాయా? అని ఆలోచిస్తారు. ఇది ఎన్నికల సమయం కదా. సప్నా చౌదరి కాంగ్రెస్ పార్టీలో చేరిందంటూ కొన్ని రోజుల నుంచి ప్రచారం సాగుతోంది.అయితే.. ఆ ప్రచారానికి సప్నా చౌదరి పులుస్టాప్ పెట్టింది.

తాను ఏ పార్టీలో చేరలేదని… వచ్చే ఎన్నికల్లోనూ ఏ పార్టీ తరుపున ప్రచారం చేయబోనని స్పష్టం చేసింది. లక్నోలో మీడియా సమావేశం నిర్వహించి మరీ.. తన రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది సప్న.

అయితే… సప్న.. కాంగ్రెస్‌లో చేరిందంటూ.. ఆమె ప్రియాంక గాంధీతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఆ ఫోటో పాతదని.. తను ప్రియాంకా గాంధీని చాలా సార్లు కలిశానని.. ఆ సమయంలో దిగిన ఫోటోతో తాను కాంగ్రెస్‌లో చేరినట్టు ప్రచారం చేస్తున్నారని ఆమె మీడియాకు తెలిపింది.