ఐస్ క్రీమ్ కు అలవాటు పడిన కాకి.. ఇంతకీ పక్షులు ఐస్ క్రీమ్ తింటాయా? ఈ వీడియోలో చూడండి

-

కాకికి చికెన్ ముక్కో.. మటన్ ముక్కో దొరికితే లొట్టలేసుకుంటూ తింటుంది కానీ.. ఐస్ క్రీమ్ తినడం ఏంది.. అయినా పక్షులు ఐస్ క్రీమ్ తింటాయా? అని తొందరపడకండి. మిగితా పక్షుల గురించి ఏమో కానీ.. ఈ కాకి మాత్రం ఐస్ క్రీమ్ ను లొట్టలేసుకుంటూ తింటుంది. నమ్మరా? అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. వీడియో చూడటానికి ముందు ఆ కాకి గురించి ఓ విషయం తెలుసుకోవాలి మీరు.

crow eats ice cream in pondicherry

అసలు ఆ కాకికి ఐస్ క్రీమ్ ఎలా అలవాటు అయిందో తెలుసా? ఓ రోజు ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వచ్చిన కాకి.. అక్కడ ఐస్ క్రీమ్ ముక్క కింద పడటం చూసి దాన్ని లటక్కున నోట్లే వేసుకున్నదట. దీంతో దానికి లోపల చల్లగా అనిపించిందో ఏమో.. అప్పటి నుంచి కాకి అదే ఐస్ క్రీమ్ బండి దగ్గరికి రోజూ రావడం.. ఐస్ క్రీం కావాలని అడగడం.. ఇదే తంతు రోజు. ఆ ఐస్ క్రీం బండి అతడికి దీనికి రోజూ ఐస్ క్రీం ఇవ్వలేక తల ప్రాణం తోకకు వస్తోందట. ఈ విషయం ఆనోటా.. ఈనోటా తెలిసి ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇదో సెన్సేషన్ అయిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని పాండిచ్చేరిలో చోటు చేసుకున్నది.

Read more RELATED
Recommended to you

Latest news