వీడియో..ఆర్డర్‌ చేసిన కాఫీతో ప్రియుడి ముఖంపై కొట్టిచింది..!

-

ఇష్టమైన ఆహార పదర్థాలు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకొని తింటుంటారు. కొందరు, సర్‌ప్రైస్‌ గిఫ్ట్‌గా తమ ఇష్టమైన వారి కోసం వారికే తెలియకుండా వస్తువులు, ఆహార పదర్థాలు ఆర్డర్‌ చేసి వారిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. కానీ.. ఇక్కడ మాత్రం ఓ యువతి ఆన్‌లైన్‌లో తన ప్రియుడి కోసం కాఫీ ఆర్డర్‌ చేసి అదే కాఫీతో అతగాడి ముఖ్యం పై కొట్టించి మరింత ఆశ్చర్యానికి గురి చేసిన ఘటన చైనాలో చోటు చేసుకుంది.

- Advertisement -

చైనాలోని షాంగ్‌డాంగ్‌కు చెందిన ఓ యువతి ఆన్‌లైన్‌లో కాఫీ ఆర్డర్‌ చేసింది. ‘అది తనకోసం కాదు..! మాజీ ప్రియుడి కోసం అతగాడితో మర్యాదగా ఉండాల్సిన అవసరం లేదు. అతని ముఖంపై కాఫీ చల్లిలే’ సరిపోతుందని డెలివరీ బాయ్‌కు రిక్వెస్ట్‌ చేసింది. రిక్వెస్ట్‌ విన్న డెలివరీ బాయ్‌ మొదట ఖంగుతిన్నా ఆతర్వాత ఆమె మాటల్లో బలమైన కారణం ఉందని భావించి ఆ పని చేసేందుకు ఒప్పుకున్నాడు. కాఫీతో నేరుగా ఆమె మాజీ ప్రియుడి ముందు ప్రక్ష్యమయ్యాడు.

ఒక్కసారిగా తన బ్యాగులోని కాఫీ తీసి అటుగా వస్తున్న అతనిపై చల్లాడు. దీంతో ఏం జరుగుతుందోనని అర్థం కాక మాజీ ప్రియుడు కొన్ని నిమిషాల తర్వాత షాక్‌ నుంచి తేరుకున్నాడు. ముఖంపై కాఫీ చల్లిన వెంటనే ఆ డెలివరీ బాయ్‌ అతని చేతిలో ఓ లేటర్‌ పెట్టి, స్వారీ బాస్‌ అంటూ అక్కడి నుంచి పరుగు అందుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు భిన్న విభ్ని రీతుల్లో కామెంట్స్‌ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...