వింత: మొగవాళ్ళు పొంగళ్లు పెట్టడం ఎక్కడైనా చూసారా..?

-

ఈ వింత ఆచారాన్ని చూస్తే అవాక్ అవుతారు. దేవుళ్లకు ఎక్కడైనా ఆడవాళ్లు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అంత రివర్స్. మగవాళ్లే ఇక్కడ ఇలా చేస్తారు. మరి దీని గురించి పూర్తిగా ఇప్పుడే చూసేయండి. వివరాల్లోకి వెళితే… పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఈ ఆచారం తరతరాలుగా వస్తోంది. ఇక్కడ మగవాళ్ల పొంగళ్లను ఘనంగా జరుపుకొంటున్నారు. పెద్ద పండుగ కి ముందు వచ్చే ఆదివారం దీనిని చేస్తారు. మరో వింత ఏమిటంటే…? వీళ్ళు సంక్రాంతి కంటే పొంగళ్లు పండుగనే ఘనంగా జరుపుకొంటారు.

unique tradition
unique tradition

ఈ ఊరు వాళ్ళు ఎక్కడ ఉన్న సరే ఆ రోజు వచ్చేస్తారు. అయితే ఈ ఆచారం వెనుక పెద్ద కధ ఉంది. అదేమిటంటే.. కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతం లో ఓ బ్రాహ్మణుడు తిరుగుతూ ఉండే వాడని, పురుషులతో తప్ప స్త్రీలతో మాట్లాడే వాడు కాదని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఆయన గ్రామంలో ఓ శిలను నాటి దానిపై లిపిని రాసి వెళ్ళిపోయాడట. దాని మీద ఏం రాసాడంటే..? గ్రామం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం స్వామికి మగవారే పొంగుబాళ్లు పెట్టాలని…

దీని మూలంగా అప్పటి నుంచీ ఈ ఆచారాన్ని ఫాలో అవుతున్నారు గ్రామస్థులు. మహిళలు ఆలయం లోకి రాకుండా వెలుపల నుంచే స్వామిని దర్శించుకుంటారు. అంతే కాదు స్వామి వారికి పెట్టిన నైవేద్యాన్ని కూడా మగవాళ్లే తినాలి అన్నది ఆచారం. దానిని మహిళలు కనీసం ముట్టుకోరు. అలానే ఇక్కడ సంజీవరాయునికి విగ్రహమంటూ లేదు. ఓ రాతిని ప్రతిష్ఠించి దానిపై శాసనం రాశారు అంతే. కానీ దానినే అంతా పూజిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news