మీడియాలో వస్తున్న వార్తల తీరు

-

ఎవరైనా తాము చదివే పత్రిక, చూసే చానల్ వైవిధ్యభరితంగా ఉండాలని కోరుకుంటారు.90 వ దశకంలో మన దేశంలో సంస్కరణల పుణ్యమా అని ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేటు చానళ్ళ శకం మొదలైనప్పుడు ప్రజలు ఆ మార్పుని సాదరంగా స్వాగతించారు. కానీ తాము కోరుకున్న మార్పు తాము కోరిన రీతిలో సాగకుండా గాడి తప్పుతున్న పద్దతిని మాత్రం వారు జీర్ణించుకో లేకపోతున్నారు.

విషయం ఒక్కటే. కానీ చూసే ఇద్దరికీ రెండు రకాలుగా కనిపిస్తే  వైద్య పరిభాషలో ఆ జబ్బుని ఏమని పిలుస్తారో తెలియదు.ఒక సభ కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి, ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా సమావేశం కానివ్వండి – వేర్వేరు పత్రికలు వేర్వేరు కోణాల్లో వార్తలు వండి వారుస్తున్న తీరు ఇటీవలి కాలంలో ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే  ఏ చానల్ మార్చి చూసినా ఇదే  వరస.

 

24 గంటల వార్తా చానళ్లు పుణ్యమా అని ఈరోజు సమాచారం టన్నుల కొద్దీ ప్రజలకు చేరుతోంది. ఇంత సమాచారాన్ని మనిషి మెదడు ఏ మేరకు హరాయించుకోగలదో ఆ టీవీ ఛానల్ వాళ్ళే ప్రసారం చేస్తే బాగుంటుందేమో. ఎన్ని విషయాలు విన్నా మెదడు మాత్రం దానికి వీలైనంతవరకు నిక్షిప్తం చేసుకుని మిగిలింది వొదిలేస్తుందంటారు.
ఇదే నిజమైతే – టీవీ చానళ్ళు క్షణక్షణానికీ ప్రజలకు అందిస్తున్న సమాచారంలో చాలా భాగం గుర్తుకు రానంతగా వృధా అవుతుంది అనుకోవాలి. విన్న దానికంటే చదివిందీ, చదివిన దానికంటే చూసింది ఎక్కువ కాలం గుర్తుండి పోతుందనే  సిద్దాంతానికి  ఈ సమాచార విస్ఫోటనం చిల్లులు పొడుస్తుందని  అనుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news