లంకెబిందెలు దొరికితే అరిష్టం.. తీసుకుంటే రక్తం కక్కుకొని చస్తారు అనే విషయంలో నిజమెంత? అలా జరగటానికి కారణాలు ఇవి..!

లంకెబిందెలు..ఈ పేరు వినగానే లక్ష్మీదేవే గుర్తుకువస్తుంది కదా..అబ్బా ఎవరికైనా లంకెబిందెలు దొరకాయ్ అంటే..వాడి దశ మారిపోయినట్లే అనుకుంటారు. లంకెబిందెల్లో బోల్డెంత సంపద ఉంటుందని మన అందరికి తెలిసిన విషయం..దీనితో పాటు ఇది కూడా తెలిసే ఉంటుంది. లంకెబిందెలు తీసుకుంటే అరిష్టం, తీసుకున్నవారు రక్తం కక్కుకని చావటం కాయ.అందుకే మనకు దొరికిన తీసుకోకూడదు అని మన పెద్దోళ్లు ఏదో ఒక సందర్భంలో చెప్పే ఉంటారు. అసలు నిజంగానే లంకెబిందెలు దొరికితే అరిష్టమా..నిజంగానే రక్తం కక్కుకుని చస్తారా..వీటివెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

లంకెబిందెలు చాలా కాలం క్రితం వాడుకలో ఉండేవి. వీటిల్లో విలువైన సంపదనను ఉంచి దాచిపెట్టేవారు.అలా కొన్సి సంవత్సరాల నుంచి ఎలాంటి గాలి సోకకుండా ఉంటాయి. అందుకే వాటిని ఒక్కసారిగా ఓపెన్ చేసేసరికి.. ఎక్కడలేని దుర్వాసన వస్తుంది. అంతటి ఘాటైన వాసనలను ఒక్కసారిగా పీల్చడం వలన శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కొంతమంది వీటిని భరించినప్పటికీ.. చాలా మంది ఈ వాసనలను పడలేరు.

దాంతో వారికి ఊపిరి ఆడకపోవడం, తల తిరగడం, వాంతులు అవుతుండడం వంటివి జరుగుతాయి. కొందరికి నోరు, ముక్కులోంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. మరికొందరైతే.. ఆనందం పట్టలేక బీపీ పెరగడం, హార్ట్ ఎటాక్ కూడా వస్తుంది. ఐతే.. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది.

ఇక ఇవన్నీ చూసి ఈ లంకెబిందెలు వద్దురాబాబు అనుకుంటారు. అవి తీసుకుంటే మనిషి చనిపోతాడు అని బలంగా ఫిక్స్ అయిపోయారు.వాస్తవానికి బిందెలను తీయడం అరిష్టమేమి కాదు.. కానీ.. తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే లంకెబిందెలు లోహాలతో తయారు చేస్తారు. అందులో ఉండే నాణేలు కూడా లోహాలతోనే తయారు చేస్తారు. ఇంక వీటిని భూమి లోపల ఎక్కడో దాచిపెట్టటం వల్ల క్షయానికి గురై లోపల విషవాయువు తయారువుతుంది.

అంతెందెకు మనం లొట్టలేసుకుంటూ తిన్న బిర్యానియే..మిగిలింది ఒక నాలుగురోజులు అలానే పెడితే బీభత్సమైన కంపుకొడుతుంది. అరే నాలుగురోజుల కిందట ఇది మనమేమా తినంది అనుకుంటాం. అలాంటిది కొన్ని సంవత్సరాల కిందట పెట్టినవి ఇంకెంత దుర్వాసనరావొచ్చు. ఆ వాసన భరించలేక అలా జరుగుతుంది. కాబట్టి మంచిగా ప్రీపేర్ అయి..వాసన రాకుండా మన జాగ్రత్తలు తీసుకుని లంకెబిందెలు తీసుకోంటే ఏం కాదని నిపుణులు చెబుతున్నారు.

– Triveni Buskarowthu