వామ్మో.. ఇంత రేటా? ఈ చేప ధరెంతో తెలుసా?

-

చేప ధర ఎంతుంటుంది.. మా అంటే వెయ్యి రూపాయలా? లేక పదివేలా? అంతకంటే ఎక్కువ ఉండే చాన్సే లేదు. అదేమన్నా పులస చేపనా? పులస కూడా 3 నుంచి 4 వేల కంటే ఎక్కువ పలకదు. మరి.. ఈ చేప స్పెషాలిటీ ఏంటో.. అని అంటారా? అవును.. పులస చేపకు కూడా తాత ఈ చేప.. కాదు కాదు.. ముత్తాత.. అంతకు మించి. అవును.. ఇది మామూలు గీమూలు చేప కాదు. టూనా చేప. దీన్నే అరుదైన బ్లూఫిన్ టూనా అని కూడా పిలుస్తారు. అసలు ఈ చేప దొరకడమే అరుదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకటి దొరుకుతుంది. అందుకే దానికి అంత డిమాడ్. దాని ధర అక్షరాలా 21 కోట్ల రూపాయలు.

ఈ చేపను జపాన్‌కు చెందిన సుషీ హోటల్స్ యజమాని కియోషీ కిమురా ఆ చేపను దక్కించుకున్నాడు. 278 కిలోల బరువు ఉన్న ఆ చేపను 333.6 మిలియన్ యెన్‌లకు దక్కించుకున్నాడు. అంటే మన కరెన్సీలో రూ.21 కోట్లు అన్నమాట. సుకిజి ఫిష్ మార్కెట్‌లో ఈ చేపను వేలంలో అంత ధరకు దక్కించుకున్నాడు కియోషీ. ఇదివరకు 2013లో కూడా ఇదే చేపను 155 మిలియన్ యెన్లకు దక్కించుకున్నాడట. ఇప్పుడు డబుల్ ధర పెట్టి కొనుక్కున్నాడు కియోషి.

టూనా చేప రుచే వేరు. మా రెస్టారెంట్లలో టూనా చేప ముక్క ధరే వేలల్లో పలుకుతుంది. మా రెస్టారెంట్‌కు టూనా చేపను తినడానికే ఎక్కువ కస్టమర్లు వస్తుంటారు. అందుకే ఎంత ధరైనా బెస్ట్ టేస్ట్ ఉండే ఈ చేపను కొంటా.. అని చెప్పాడు టూనా కింగ్ కియోషి. ఆయన్ను అక్కడ అందరూ టూనా కింగ్ అని పిలుస్తారట. ఎందుకంటే.. చేపల మార్కెట్‌లోకి టూనా చేప వస్తే చాలు.. వదిలిపెట్టడట ఈయన.

Read more RELATED
Recommended to you

Latest news