ఏంది సామి అరాచకం..అస్సలు తగ్గట్లే..వీడియో..

మ్యూజిక్ వింటే చాలా మంది కాలు కదుపుతారు..డ్యాన్స్ చెయ్యడానికి వయస్సుతో సంబంధం లేదని చాలా మంది నిరూపించారు..అందుకు సంబందించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి..80 దాటిన వాళ్ళు కూడా తగ్గేదేలే అంటూ మాస్ స్టెప్పులు వేస్తూ రచ్చ చేస్తున్నారు..ఇండియాలో అయితే ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే డాన్స్ మాత్రం పక్కా ఉంటుంది. వివాహాలు, పండుగలు, ఊరేగింపులలో డీజే పాటలు, డప్పులకు యువకులు రెచ్చి పోయి డాన్స్ చేస్తూ ఉంటారు.

కొన్నిసార్లు మహిళలు కూడా మైమరచిపోయి డాన్స్ లతో దుమ్మురేపుతూ ఉంటారు. ఇక నాగిని మ్యూజిక్ వచ్చిందంటే చాలు ఉత్సహం డబుల్ అవుతుంది. తాజాగా ఓ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఇప్పుడు మరో ఇద్దరూ తాతలు సోషల్ మీడియాను షేక్ చేశారు..డ్యాన్స్ తో ఇరగదీసారు..

ఇద్దరు వృద్ధులు నాగిన్ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు వృద్ధుల్లో ఒకరు బూర ఊదుతున్నట్టు చేస్తుంటే దానికి తగ్గట్టు మరో వృద్ధుడు నాగినాలా మెలికలు తిరిగాడు. వాళ్లు డాన్స్ చేయడం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. అది కూడా ఈ వయస్సులో అంటే వావ్ అనాల్సిందే..వీరిద్దరూ ఇలా ఎనర్జీగా డ్యాన్స్‌లు చేయడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఈ వయసులో ఇద్దరికీ బలం, ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వయసులో కూడా వాళ్ళు ఆరోగ్యాన్ని, శరీరాన్ని అంత దృఢంగా ఉంచుకున్నారని కొనియాడారు. కొంతమంది తాగి ఉన్నారుఅందుకే ఇలా చేస్తున్నాడంటూ చమత్కరించారు.. మొత్తానికి గత రెండు మూడు రోజుల నుంచి ఈ వీడియో వైరల్ అవుతుంది..ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై ఓ లుక్ వేసుకోండి… వాళ్ళ డ్యాన్స్ కు ఒక కామెంట్ చెయ్యండి..