ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అవతరించింది : మోడీ

-

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం చేరుకున్నారు భారత ప్రధాని మోడీ. ఎరువుల కర్మగారాన్ని, భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని ప్లాంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఎన్టీపీసీ పెర్మనెంట్ టౌన్ షిప్ లో ఏర్పాటుచేసిన వేదిక పైకి ప్రధాని మోడీ చేరుకున్నారు. అయితే.. ప్రధానికి తులసి మొక్క ఇచ్చి స్వాగతం పలికారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం వచ్చాక..దేశంలో అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని మోడీ తెలిపారు. 24 గంటల పాటు..దేశాభివృద్ధి కోసమే పరితపిస్తున్నామన్నారు. కరోనా ప్రపంచ దేశాలను ఎంతో ఇబ్బంది పెట్టిందని.. దీని వల్ల దేశం కూడా తీవ్ర ఇబ్బందులకు గురైందన్నారు మోడీ. ఈ కష్టకాలంలోనూ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అవతరించిందన్నారు.

India marching towards becoming world's third biggest economy: Modi

 

ఎనిమిదేండ్లుగా సుపరిపాలన అందిస్తున్నామని..దీనికి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీయే నిదర్శమని చెప్పారు మోడీ. రైతులకు ఇప్పటి వరకు 10 లక్షల కోట్లు ఖర్చుచేశామని మోడీ వెల్లడించారు. రాబోయే రెండున్నరేండ్లలో మరో రెండున్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు మోడీ. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలను కలిపే రైల్వే లైన్ను ప్రారంభించామని ప్రధాని మోడీ తెలిపారు. వీటితో పాటు..జాతీయ రహదారులను ప్రారంభించామని చెప్పారు మోడీ. రైల్వే లైన్లు, జాతీయ రహదారుల ప్రారంభం వల్ల రాష్ట్రంలో ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణలో ఇవాళ రూ. 10 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు మోడీ. తెలంగాణ డెవలప్ మెంట్ కోసం బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మోడీ చెప్పారు మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news