సాధారణంగా కిలో ఉల్లిగడ్డ ధర ఎంతుంటుంది అంటే.. 20 రూపాయలు అని చెప్పొచ్చు. అయితే.. ఒక్కోసారి ఉల్లిధరలు ఆకాశాన్ని అంటడం కూడా మనం చూశాం. 100 రూపాయలకు కిలో ఉల్లిగడ్డ అమ్మిన రోజులూ ఉన్నాయి. అయితే.. ఇప్పుడు మాత్రం ఉల్లిగడ్డ ధర పాతాళానికి తాకింది. అవును.. ఇప్పుడు కిలో ఉల్లిగడ్డ ధర ఎంతో తెలుసా? కేవలం రూపాయి. అవును.. ఒక్క రూపాయి అంతే. ఓ చాక్లెట్ విలువ. కాకపోతే ఈ ధర కర్ణాటకలోని హుబ్బళ్లిలో. అక్కడ మార్కెట్ లో ఉల్లిధర ఏకంగా రూపాయికి పడిపోయిందట. గత వారం క్వింటాకు 650 రూపాయలు పలికిందట ఉల్లిగడ్డ. కాని… ప్రస్తుతం 100 రూపాయలకు చేరుకున్నదట. 100 కిలోలకు 100 రూపాయలంటే.. కిలో ఒక్క రూపాయే కదా. ఉల్లిధరలు అమాంతం పడిపోవడంతో ఉల్లి రైతులు లబోదిబోమంటున్నారు. బ్రోకర్ల కక్కుర్తి వల్లే ఇలా ధరలు పడిపోయాయని రైతులు బోరుమంటున్నారు.
రూపాయికే కిలో ఉల్లిగడ్డ…
By Anil Kumar
-
Previous article
Read more RELATEDRecommended to you
గంట వ్యవధిలోనే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆ తల్లి మళ్లీ జన్మించినట్లే..! కొన్నిసార్లు గర్భిణులు...
ఒకే కుటుంబం.. ఒకేసారి 17 మందికి పెళ్లి..!
సాధారణంగా పెళ్లి అంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది....
Anji N -
బర్తడే రోజు కేక్ తిన్న కాసేపటికే చనిపోయిన పదేళ్ల బాలిక
బయట ఆహారం తినొద్దని ఎప్పటికప్పుడు ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెప్తూనే ఉన్నారు....