వైరల్‌ వీడియో: వైన్ స్టోరేజీ యూనిట్లు పగిలిపోవడంతో ఏరులైపారిన రెడ్‌ వైన్..

-

ఏరులైపారుతున్న మద్య అని..మనం ఏదో అతిశయోక్తి కోసం వాడుతుంటాం. కానీ అక్కడ నిజంగానే వరదలా రెడ్‌వైన్‌ పారింది. అసలు ఈ వీడియో మద్యం ప్రియులు చూస్తే.. గుండె విలవిలలాడిపోతుందేమో.. వైన్ షాపుల్లో, లిక్కర్ మార్ట్‌లో అత్యంత ఖరీదైన లేబుల్స్‌తో ఉన్న బాటిళ్లలో కనిపించే రెడ్ వైన్ వీధుల్లో నదీ జలాల తరహాలో పోతే..ఇదేదో ఇమాజినేషన్‌ కాదు.. నిజంగానే రెడ్‌ వైన్‌ అంతా గంగాపాల్‌ అయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

పోర్చుగల్‌లోని సావో లోరెంకో డి బైరో పట్టణంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని ఎత్తుగా ఉన్న కొండ ప్రాంతంపై నుంచి లక్షల లీటర్ల రెడ్ వైన్ ప్రవాహంలా కిందున్న వీధుల్లోకి ప్రవహించడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నాం అన్నట్టుగా ఆ రెడ్ వైన్ వైపు చూశారు. ఇళ్ల మధ్య నుంచి నదిలా ప్రవహిస్తున్న రెడ్ వైన్‌ని చూసి అందరూ షాక్‌ అయ్యారు.

పోర్చుగల్ మీడియా కథనాల ప్రకారం.. సుమారు 2.2 మిలియన్ లీటర్ల రెడ్ వైన్ వీధులపాలైంది. అంటే 600,000 గ్యాలన్ల రెడ్ వైన్ రోడ్లపై వరదలా వెల్లువెత్తిందన్నమాట. రోడ్లపై పొంగిపొర్లిన రెడ్ వైన్‌తో 2,933,333 వైన్ బాటిళ్లను నింపవచ్చని అంచనాలు చెబుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇలా కిందపోయిన రెడ్ వైన్‌తో ఏకంగా ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ పోటీల కోసం నిర్మించే ఒక స్విమ్మింగ్ పూల్‌నే నింపేయొచ్చు అని న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది.

2 వైన్ స్టోరేజీ యూనిట్లు పగిలిపోవడం వల్ల ఇలా రెడ్ వైన్ ఏరులై పారిందని లెవిరా డిస్టిలరీస్ కంపెనీ తెలిపింది. పట్టణ వాసులకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ ఫేస్‌బుక్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు అవనప్పటికీ.. ఇక్కడి ప్రజలకు జరిగిన అసౌకర్యానికి, కొద్దిపాటి సాధారణ నష్టానికి తాము చింతిస్తున్నాం అని లెవిరా డిస్టిలరీస్ కంపెనీ తమ ఫేస్ బుక్ పోస్టులో పేర్కొంది. సమీపంలోని సెర్టిమా నది జలాలు ఈ రెడ్ వైన్ కారణంగా కలుషితం కాకుండా ఉండేందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. రెడ్ వైన్ ప్రవాహాన్ని నది వైపు వెళ్లకుండా మళ్లించే పనుల్లో అక్కడి అగ్నిమాపక శాఖ బిజీ అయింది. ప్రస్తుతం ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో నెటిజెన్స్‌ని మంత్రముగ్ధులను చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news