వామ్మో… మేక‌ప్‌తో ఈ మ‌హిళ ఎంత అందంగా మారిందో చూడండి..!

-

భార‌తీయుడు సినిమాలో క‌మ‌ల‌హాస‌న్ వృద్ధుని గెట‌ప్ వేశాడు గుర్తుంది క‌దా. అప్ప‌ట్లో ఆ గెట‌ప్ వేసిన‌ప్పుడు ఆయ‌న్ను ఎవ‌రూ అస్స‌లు గుర్తు ప‌ట్ట‌నేలేద‌ట‌. ఇక త‌రువాత వ‌చ్చిన మ‌రో సినిమా ద‌శావ‌తారంలోనూ నిజంగా క‌మ‌ల్‌హాస‌నేనా అనిపించేలా ఆయ‌న్ను పూర్తిగా మార్చేసి ఏకంగా 10 విభిన్న‌మైన గెట‌ప్‌ల‌లో సినిమాలో చూపించారు. నిజంగా ఇలా చేయ‌డం మేక‌ప్ ఆర్టిస్టుల‌కే సాధ్య‌మైంది. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోతున్న‌ది కూడా స‌రిగ్గా ఇలాంటి కోవ‌కు చెందిన ఓ మేక‌ప్ ఆర్టిస్టు గురించే. కానీ ఆమెది ఇండియా కాదు.. చైనా…

వీడియోలో ఇప్ప‌టికే మీరు చూసి ఉంటారు. ఆమె పేరు కి హువా హువా. ఉంటున్న‌ది చైనాలో. ఆమె త‌న ముఖాన్ని మేక‌ప్‌తో పూర్తిగా మార్చేసుకుంది చూశారు క‌దా. మొద‌ట మేక‌ప్ వేసుకోక ముందు, త‌రువాత మేక‌ప్ వేసుకున్న‌ప్పుడు, దాన్ని తీసేశాక తాను ఎలా ఉందో వీడియోలో మ‌నం చూడ‌వ‌చ్చు. నిజంగా ఆమెకున్న మేక‌ప్ నైపుణ్యాన్ని అభినందించ‌క త‌ప్ప‌దు. అంత‌లా ఆమె త‌న రూపాన్ని పూర్తిగా మార్చేసుకుంది.

Makeup Tranformation

How to get away with murder.

Posted by 9GAG on Friday, August 3, 2018

మొద‌ట ముఖం, త‌రువాత క‌ళ్లు, పెదాలు, ముక్కు, బుగ్గ‌లు, మెడ‌.. ఇలా అన్ని భాగాల‌ను ఆమె మేక‌ప్‌తో అద్భుతంగా మార్చేసింది. దీంతో ఆమె మార్పును చూసి చాలా మంది షాక‌య్యారు. మేక‌ప్ ఇంత అద్భుతంగా ఎలా చేసింద‌ని అంద‌రూ ఆమెను ప్ర‌శ్నిస్తున్నారు. ఇక ఆమె మేక‌ప్ చేసుకున్న వీడియోను అయితే సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా కొన్ని ల‌క్ష‌ల మంది వీక్షించారు. కేవ‌లం చైనాలో మాత్ర‌మే కాదు, ఇప్పుడీ వీడియో ప్ర‌పంచం మొత్తం నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఏది ఏమైనా ఈ మ‌హిళ మేక‌ప్ నైపుణ్యాన్ని అభినందించాల్సిందే క‌దా..! నిజంగా ఎవ‌రైనా మ‌హిళ‌లు ఇలా త‌మ ముఖాన్ని పూర్తిగా మార్చుకుని ఎవ‌ర్న‌యినా త‌మ అందంతో పడేసి, వారిని పెళ్లి చేసుకుంటే..? త‌రువాత నిజం తెలిస్తే..? ఇక అప్పుడు అలాంటి బాధితుల‌కు ఉంటుంది చూడండి.. అలాంటి వారి బాధ‌ను మాటల్లో చెప్ప‌లేం..!

Read more RELATED
Recommended to you

Latest news