కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా. ఇది కూడా అంతే. ఈ వ్యక్తి చూడండి.. ఒకేసారి ఎన్ని ఇటుకలు తలపై మోస్తూ తీసుకెళ్తున్నాడో? అది కూడా సన్నని వంతెనను దాటుతూ. రెండు మూడు ఇటుకలను తల మీద పెట్టుకుంటేనే తలపై ఎంతో బరుపు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. కానీ.. ఈ వ్యక్తి మాత్రం ఏకంగా ఒకేసారి 30 నుంచి 40 ఇటుకలను మోస్తున్నాడు. అన్ని ఇటుకలను ఎత్తుకొని ఒక్క అడుగు వేయాలంటేనే కష్టం. కానీ.. వాళ్లకు తప్పదు. రోజుకు మూడు పూటలా తిండి దొరకాలంటే ఇలా గొడ్డు చాకిరి చేయాల్సిందే. బాగా కష్టపడటమే కాదు.. ఆ పనిని ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా డబ్బులు కూడా వస్తాయి. అందుకే.. ఇలా లేబర్స్ కూడా స్మార్ట్‌వర్క్‌ను నమ్ముకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. వీళ్లంతా బయటికి కనిపించరు.. వీళ్ల కష్టపడేతత్వం, టాలెంట్, స్మార్ట్‌వర్క్‌కు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే అంటూ ఆ వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇక.. మనోడి స్మార్ట్‌వర్క్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు.
This is pure class.
Could you write a single word to honor his talent?I dedicate this post to the people who work behind the scene & never appreciated.
Linkedin@hvgoenka @jaavedjaaferi pic.twitter.com/3RZaMf6BSK
— S R Ramnarayan (@ramnarayan_sr) February 7, 2019