ఏకంగా పులినే భయపెట్టిన ఎద్దు.. వీడియో వైరల్..!

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. నిజానికి ఈ వీడియో కూడా అలాంటిదే తరచూ సోషల్ మీడియాలో వీడియోలు బయట పడుతూ ఉంటాయి. తాజాగా ఒక వీడియో వైరల్ గా మారింది. మామూలుగా అడవిలో జంతువులు ఒక దానితో ఒకటి పోరాడుతూ ఉండడం మనకు తెలుసు.

 

పైగా ఇలా జంతువులు పోరాడుకునే కొన్ని వీడియోలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. కానీ ఈ వీడియో అంతా కూడా రివర్స్. ఎక్కడైనా పులి భయపడుతుంది కానీ ఇప్పుడు భయపడుతోంది. ట్విట్టర్లో ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా షేర్ చేయడం జరిగింది. ఒక ఎద్దు పులిని భయపెడుతోంది. ఎద్దు అడవిలో రోడ్డు వెంట వస్తున్నప్పుడు లోపల నుండి పులి వచ్చి ఆ ఎద్దు పై దాడి చెయ్యబోయింది.

కానీ ఎద్దు ధైర్యంగా పులిని వెంటాడుతుంటే పులి భయంతో అడవిలోకి పారిపోయింది. రోడ్డు మీద నుండి ఎద్దు వెళ్లిపోయిన తర్వాత తిరిగి పులి వచ్చి రహదారిని దాటింది. తర్వాత రహదారి మధ్యలో పులిని చూసిన ఒక డ్రైవర్ వ్యాన్ ని ఆపేయడం ఈ వీడియోలో మనం చూడొచ్చు. చాలా మంది ఈ వీడియోని ఇప్పటికే చూశారు. 9 వందల కంటే ఎక్కువ లైకులు వచ్చాయి. ఈ వీడియోని చూసి చాలా మంది నెటిజన్లు కామెంట్లు కూడా చేశారు. మరి మీరు కూడా వైరల్ అయిన ఈ వీడియో చూసేయండి.