ఆ ఆలయంలో ఎటు చూసిన పాములే.. పోటెత్తుతున్న జనం..

-

మనదేశంలో ఆలయాలు ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే.. అయితే ప్రతి ఆలయంలోనూ దేవుడి విగ్రహం ఉంటుంది..కానీ మనం చెప్పుకోబోయే ఆలయంలో మాత్రం అమ్మవారు పాముల రూపంలో ఉంటార.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. విషయానికొస్తే..కొండాలమ్మ ఆలయంలో పాములా రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు.. మహబూబాబాద్ జిల్లాలో 4 రోజుల పాటు ఉగాది పర్వదినాన ఘనంగా జరిగే కొండలమ్మా జాతర వైభవంగా జరుగుతుంది. గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామ శివారులో కాకతీయుల కాలం నాటి అద్భుత కట్టడం శ్రీ కొండలమ్మ అమ్మ వారి ఆలయం వరంగల్ వెయ్యి స్తంభాల గుడిని పోలి ఉంటుంది..

కాకతీయుల కాలంలో ముగ్గురు అక్కాచెల్లెల్ల పేరుతో కొండలమ్మ చెరువు, గారమ్మ చెరువు, బాయమ్మ చెరువు ఇలా ముగ్గురి పేర్లతో.. మూడు చెరువులను పినిరెడ్డిగూడెంలో నిర్మించారు. కొండలమ్మ అమ్మవారిని ప్రతిష్టించారు. ఉగాది పర్వదినం నుంచి 4 రోజుల పాటు ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తుంటారు. జాతర ప్రారంభం రోజు ఎడ్ల బండ్ల ప్రబలతో గుడి చుట్టు ప్రదర్శనలు చేస్తారు.

ఉగాది రోజున ముగ్గురు అమ్మవార్లు మూడు పాముల రూపంలో దర్శనమిస్తారని ఇక్కడి భక్తుల నమ్మకం.. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పాములుగా అమ్మవారు దర్శనమిచ్చారు.. ఆ దృశ్యాన్ని చూడటానికి భక్తులు పోటేత్తారు..ఇకపోతే అమ్మవార్లను దర్శించుకున్నారు. కేవలం జాతర సమయంలో మాత్రమే అమ్మవారి ఆలయంలో పాములు భక్తులకు కనిపించి తిరిగి ఎక్కడికి వెలుతాయో ఎవరికీ తెలియదని భక్తులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news