పాము నుండి పిల్లలను కాపాడుకునేందుకు కోడి పడ్డ తాపత్రయం… వీడియో వైరల్..!

ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. పైగా కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతూ ఉంటాయి. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఒక జంతువు మరొక జంతువులను చంపి తినడం సహజం.

 

మృగాలు కూడా ఇతర జంతువుల్ని తింటూ ఉంటాయి అలాగే ఇక్కడ వీడియోలో పాము కోడి పిల్లల మీద కి వెళ్తుంది. సర్ప జాతుల్లో ఒకటైన కింగ్ కోబ్రా కోడి పిల్లల్ని తినడానికి వెళ్లగా… దాని నుండి తన పిల్లల్ని కాపాడుకోవడానికి కోడి పాము తో పోరాటం చేసింది. ఇప్పుడు అది వైరల్ గా మారింది. కోడి తన పిల్లలతో కలిసి ఒక గది దగ్గర ఉంటుంది. కింగ్ కోబ్రా అక్కడికి వస్తుంది.

మెల్లగా పాము కోడి పిల్లలు దగ్గరికి వెళుతుంది. పిల్లలను తినడానికి పాము వస్తోందని గ్రహించిన కోడి భయపడకుండా పాముకి ఎదురు తిరిగింది పాము బారిన పడకుండా తన పిల్లల్ని రక్షించుకుని పాము పై దాడి చేస్తూ కోడి పిల్లలను బయటికి తప్పించేసింది ఆ కోడి. మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి ఈ వీడియోకి. మూగ జీవులుకు అయినా సరే తల్లి ప్రేమ ఇలా ఉంటుందని ఈ వీడియో మనకి తెలిపింది.