సమాజాన్ని నిర్మించే శక్తి టీచర్లకు మాత్రమే ఉంది : సబితా ఇంద్రారెడ్డి

-

విద్యారంగాన్ని ప్రగతి బాటలో నడిపి విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కానీ రాష్ట్ర ఆశయాలకనుగుణంగా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. విద్యార్థి సర్టిఫికెట్ తీసుకొని బయటకు వెళ్లితే కచ్చితంగా ఉద్యోగం దొరుకుతుందనే భరోసా ఇవ్వాలన్న సీఎం ఆదేశాల మేరకు డిమాండ్ ఉన్న కోర్సులు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని చెప్పారు.

సమాజాన్ని గొప్పగా నిర్మించే శక్తి ఉపాధ్యాయులకు ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కరోనా సమయంలో విద్యార్థుల చదువు కోసం ఉపాధ్యాయులు ఎంతో శ్రమించారని గుర్తు చేశారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఉత్తమ గురువులను మంత్రి సబితా సత్కరించారు. సమాజంలో డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి సబితా సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news