బైక్‌ల మీద తిరుగుతూ.. పులుల సంచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇంతలోనే ఓ పులి.. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. వాళ్లపైకి దూసుకొచ్చింది. దీంతో భయపడ్డ ఆఫీసర్లు వెంటనే బైక్ వేగం పెంచారు. దీంతో ఆ పులి కాసేపు ఆ బైక్‌ను చేజ్ చేసింది.
సాధారణంగా రోడ్ల మీద బైక్‌లపై వెళ్తుంటే కుక్కలు వెంట పడుతుంటాయి కదా. కానీ.. ఇక్కడ మాత్రం పులి వెంట పడింది. కుక్కలు వెంట పడితే పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే.. అవి వెంట పడుతాయి తప్పితే ఏం చేయవు. కానీ.. అదే పులి.. వెంటాడి వెంటాడి బైక్‌పై పంజా విసిరితే ఇంకేమన్నా ఉందా? అచ్చం సినీఫక్కీలాంటి ఘటన కేరళలో చోటు చేసుకున్నది.
కేరళలోని ఓ అడవిలో ఫారెస్ట్ ఆఫీసర్లు పెట్రోలింగ్ చేస్తున్నారు. బైక్‌ల మీద తిరుగుతూ.. పులుల సంచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇంతలోనే ఓ పులి.. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. వాళ్లపైకి దూసుకొచ్చింది. దీంతో భయపడ్డ ఆఫీసర్లు వెంటనే బైక్ వేగం పెంచారు. దీంతో ఆ పులి కాసేపు ఆ బైక్‌ను చేజ్ చేసి తర్వాత బైక్ వేగం అందుకోలేక అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Forest officials in Kerala escaped unharmed while on patrolling to find out movement of tigers. A tiger chased them for a while. pic.twitter.com/604o7wLIiG
— Sushil Rao (@sushilrTOI) June 30, 2019