ట్రాఫిక్ పోలీస్ ఇంట్లో బంగారంతో తయారు చేసిన టాయిలెట్.. వైరల్ అవుతున్న వీడియో..!

-

రష్యా ఇన్వెస్టిగేటర్స్ లంచం దర్యాప్తులో భాగంగా తాజాగా ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారిపై ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. నిజంగా దీన్ని చూస్తే షాక్ అవుతారు. సాధారణంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టి కట్టుకున్న ఇళ్లల్లో లేదా బంగళాలో రేటు ఎక్కువ ఉన్న సామాన్లని, మంచి ఇంటీరియర్ ని చేయించుకోవడం చూస్తాం.కానీ Col Alexei Safonov మాత్రం ఏకంగా బంగారం gold తో టాయిలెట్లని నిర్మించారు. చూసిన వాళ్లందరూ అవాక్ అవుతున్నారు. నిజంగా ఈ వీడియో తెగ వైరల్ అయ్యి పోయింది. ఇక మనం అసలు విషయం లోకి వెళ్లి పోతే..

 

లంచం దర్యాప్తులో భాగంగా రష్యా ఇన్వెస్టిగేటర్ ట్రాఫిక్ పోలీస్ యొక్క రాజా భవనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ భవనంలో ఒక బంగారు మరుగుదొడ్డి తో పాటుగా ఎంతో లగ్జరీగా అన్ని గదులని నిర్మించారు. అతను వ్యాపారులకు నకిలీ అనుమతులు ఇస్తూ లంచాలు ఎక్కువగా తీసుకుంటున్నట్లు గుర్తించారు.

అదే విధంగా ఈ ట్రాఫిక్ పోలీస్ ఒక మాఫియా ముఠాని కూడా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా చేస్తున్నందుకు అతనిని ఉద్యోగం నుండి తొలగించారు. ఇది ఇలా ఉంటే అతని ఇంటి ఫోటోలు మాత్రం లీక్ అయ్యాయి.

ఆ ఇంటి గదులు, అలంకరణ, బంగారు మరుగుదొడ్లు ఇవన్నీ చూసి నేటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే దీనిని చూస్తుంటే చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ ముఠాని నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఎంత ప్రాపర్టీ ఉంటుంది అనేది చూస్తే… 19 మిలియన్ రూబిళ్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ నంబర్ ప్లేట్స్ నుంచి ఎన్నో రకాల మోసాలు చేస్తున్నాడని ఎక్కువ లంచాలు కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. ఒకవేళ కనుక దోషిగా తేలితే 8 నుండి 15 ఏళ్లు జైలుశిక్ష పడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news