వైరల్‌ వీడియో: టర్కిష్‌ ఐస్‌క్రీమ్‌ వెండార్‌కే చుక్కలు చూపించిన కష్టమర్‌..

-

టర్కిష్‌ ఐస్‌క్రీమ్‌ వెండార్లు కస్టమర్స్‌కు ఐస్‌క్రీమ్‌ ఇవ్వడానికి ఎన్ని తిప్పలు పెడతారో మనం చాలా వీడియోస్‌ చూసే ఉంటాం.. చిన్నాపెద్దా అని తేడా లేకుండా.. ఆడేసుకుంటారు.. చిన్నపిల్లలైతే.. సహనం కోల్పేయి ఏడుస్తారు.. అరుస్తారు.. అలాంటి వీడియోస్‌ చూసినప్పుడు అయితే మనం భలే ఫన్నీగా అనిపిస్తుంది.. పెద్ద వాళ్లు అయితే ఇక ఈ సీన్‌ కూడా వదలకుండా రీల్స్‌ చేసుకుంటారు.. కానీ ఈ ఐస్‌క్రీమ్‌ వీడియో అన్నిటికంటే హైలెట్..వెండార్‌కే దిమ్మతిరిగిపోయే షాక్‌ ఇచ్చాడు..
వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఐస్‌క్రీమ్ వెండార్‌కే షాక్ ఇచ్చాడు. వాళ్లు ఓ పెద్ద స్టిక్‌ చివర ఐస్‌క్రీమ్‌ పెట్టి ఎంతకీ ఇవ్వకుండా లాగేసుకుంటారు కదా.. అలానే ఆ వ్యక్తితో కూడా ఆడుకున్నారు..మనోడికి తిక్కలేసింది.. నా తోనే ఆటలా అంటూ ఆ స్టిక్‌ను గట్టిగా పట్టుకుని లాగేసుకున్నాడు. దానికి చివర్లో ఉన్న ఐస్‌క్రీమ్‌ను నిమిషంలో పరాపరా నమిలేశాడు.. చుట్టూ ఉన్న వాళ్లంతా ఇది చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు ఆ వెండార్‌ను కింద పడేసేంత పని చేశాడు ఆ కస్టమర్.
చేతులు రెండు గట్టిగా పట్టుకుని, వెనక్కి నెట్టేసి…ఇలా ఓ చిన్న యుద్ధమే చేశాడు. ఆ తరవాత ఐస్‌క్రీమ్‌ను తిన్నాడు.. ఐస్‌క్రీమ్‌ తిన్నాక ఆ వ్యక్తి మొఖం చూడాలి..యుద్ధంలో వందమందిని చంపేసినట్లు గర్వంగా ఫేస్‌ పెట్టి ఆ వెండార్‌ వైపు చూశాడు.. వెంటనే ఆ వెండార్ “మూతి తుడుచుకోండి” అంటూ టిష్యూ పేపర్ ఇచ్చాడు. ఓ యూజర్ ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అయింది. 20 లక్షల వ్యూస్ వచ్చిన ఈ వీడియోను వేలాది మంది షేర్ చేసుకున్నారు.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మాకు ఇలానే జరిగింది.. నేను అప్పుడు ఇట్లానే ఏదో ఒకటి చేద్దామనుకున్నా అని ఓ యూజర్‌ అంటే.. కొంచెం ఉంటే.. వెండార్‌ పని అయిపోయేదేమో అని ఇంకో యూజర్‌ అన్నాడు. ఏది ఏమైనా ఇప్పటివరకూ ఉన్న టర్కిష్‌ ఐస్‌క్రీమ్‌ ఫైట్స్‌లో ఇది ది బెస్ట్‌ అనొచ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news