కరోనా వైర‌స్ మెద‌డులోని క‌ణాల‌కు సోకితే ఏమ‌వుతుంది ? కేంద్ర మంత్రి స‌మాధానం..

-

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి గ‌త వారం కిందట క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా నేప‌థ్యంలో ఆమె హోం ఐసొలేష‌న్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే స్మృతి ఇరానీ ఇంట్లో ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా కాల‌క్షేపం చేస్తున్నారు. అభిమానులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో ఆమె తాజాగా ఓ ఫ‌న్నీ మీమ్‌ను పోస్ట్ చేశారు.

what happens when covid meets brain cells union minister reply

మ‌న శ‌రీరంలోకి కోవిడ్ ముక్కు, నోరు, క‌ళ్ల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. త‌రువాత అది నెమ్మ‌దిగా ఊపిరితిత్తుల్లోకి ప్ర‌వేశించి ఆ త‌రువాత ల‌క్ష‌ణాల‌ను క‌లిగిస్తుంది. త‌రువాత నెమ్మ‌దిగా తీవ్ర‌త పెరుగుతుంది. ఆ స‌మయం లోగా స్పందించ‌క‌పోతే ప్రాణాల‌కే ముప్పు ఏర్ప‌డుతుంది. అయితే కోవిడ్ అనేది మ‌న మెద‌డుకు వ్యాపించ‌దు. కానీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దీనిపైనే ఫ‌న్నీగా మీమ్ పోస్ట్ చేశారు.

కోవిడ్ మ‌న మెద‌డుకు వ్యాప్తి చెందితే ఏమ‌వుతుంది ? అని ఆమె ప్ర‌శ్న వేసి దానికి స‌మాధానం ఇచ్చారు. When the virus meets your brain cells.. COVID spelled backwards is DIVOC. What DIVOC is happening ? కోవిడ్ మీ మెద‌డుకు వ్యాప్తి చెందితే అప్పుడు కోవిడ్ అనే ప‌దాన్ని వెన‌క నుంచి చ‌ద‌వాలి. వాట్ డివోక్ ఈజ్ హ్యాపెనింగ్ ? అని ఆమె పోస్ట్ చేశారు. దీంతో ఆ మీమ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news