ప్లాస్టిక్ బాటిళ్లతో చెప్పులు తయారు చేసి.. ఆన్ లైన్ లోనే అమ్మకానికి పెట్టింది.!

-

Woman sells chappals online made by plastic bottles

జూగాడ్ అంటే తెలుసు కదా మీకు. ఏదైనా ఒక వినూత్నమైన ఐడియాను కార్యరూపం దాల్చడమే జూగాడ్. కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడమే జూగాడ్. జూగాడ్ అంటే ఓ ఆలోచన. వినూత్న ఆలోచన. అది ఏదైనా కానీ.. ఇప్పటి వరకు ఎవరూ అటువంటి ఆలోచన చేయకుండా ఉంటే.. అది ఓ జూగాడ్.

ఇటీవలే అమెజాన్ లో నాచురల్ కొబ్బరి చిప్పలు అంటూ అమ్మారు గుర్తుందా? 1300 రూపాయలకు దేనికీ పనికి రాని చిప్పను అమ్మారు. దానిపై సోషల్ మీడియాలో పెద్ద వారే నడిచింది. ఇప్పుడు అదే తరహాలో ఓ మహిళ ఏకంగా ప్లాస్టిక్ బాటిళ్లతో చెప్పులు తయారు చేసి వినూత్నతకు తెర తీసింది. న్యూజిలాండ్ కు చెందిన ఈ మహిళ ఇలా… పనికిరాని ప్లాస్టిక్ బాటిళ్లను, ప్లాస్టిక్ స్ట్రాప్స్ ను కలిపి సింపుల్ గా చెప్పులు తయారు చేసి ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది. మీరు పైన చూస్తున్న ఫోటో అదే. ఆ చెప్పుల ధర ఎంతో తెలుసా? 20 డాలర్లు అంటే 1423 రూపాయలు. మరి.. ఈ చెప్పులను కొంటున్నారా? లేదా? అనేది పక్కన పెట్టండి. ఆమె ఐడియాకు సలాం కొడుతున్నరు నెటిజన్లు. కొంతమంది నెటిజన్లు మాత్రం.. వామ్మో.. ఈ చెప్పులను వేసుకుంటే ఉంటామా? జారి పడం అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Woman sells chappals online made by plastic bottles

Read more RELATED
Recommended to you

Latest news