విమానం మిస్సయిందని.. చేజ్ చేసింది.. వీడియో

-

Woman Trying To Chase Down Plane After Missing Her Flight

విమానం మిస్సయిందని ఓ మహిళ ఆ విమానాన్ని చేజ్ చేసింది. దాని వెనుక పరిగెత్తింది. దాన్ని ఆపాలంటూ అరుస్తూ దాని వెనుక పరిగెత్తసాగింది. షాకింగ్‌గా ఉంది కదా. అవును.. బస్సు వెనుక లేదంటే రైలు వెనుక పరిగెత్తే వాళ్లను చూశాం కానీ.. ఇలా విమానం వెనుక పరిగెత్తిన వాళ్లను మాత్రం ఇంతవరకు చూడలేదంటారా? అవును.. మీరు ఇంతవరకు చూసి ఉండరు. ఈ ఘటన ఇండోనేషియాలోని బాలి ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకున్నది.

ఓ మహిళ జకర్తా వెళ్లడం కోసం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లింది. ఆమె కాస్త ఆలస్యంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడంతో అప్పటికే విమానం టేకాఫ్ అవుతోంది. టేకాఫ్ అవుతున్న విమానం దగ్గరికి వెళ్లడానికి ఆమె ప్రయత్నించింది. దీంతో ఆమె వింత చేష్టలను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను నిలువరించారు. అక్కడి నుంచి తీసుకెళ్లారు. తర్వాత జకర్తా వెళ్లే మరో విమానంలో పంపించారు. ఈ ఘటన ఎయిర్‌పోర్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news