ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ రోజు ఏం చేస్తారంటే?

-

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీక బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలయ్యింది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది. బతుకమ్మ లో ప్రధాన ఆకర్షణగా నిలిచేవి తీరొక్క పూలు. బంతి, చామంతి, గునుగు, తంగేడు, గులాబీ..

ఇలా ఒక్కటేంటి… ప్రకృతిలో లభించే పూల తో అందంగా అలంకరించి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. రోజుకో రకమైన పూలతో అలకంరిస్తూ వేడుకలు నిర్వహిస్తారు. అక్టోబర్ 3 వరకు ఈ బతుకమ్మ పండుగ జరుపు కోనున్నారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ (బతుకమ్మ) తో ఈ పండుగ ముగుస్తుంది.. బతుకమ్మ వేడుకల్లో ఏడో రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్ఠి (శనివారం) నాడు బియ్యప్పిండిని వేయించి, బెల్లం కలిపి వేపకాయ ఆకారంలో చేసిన వంటను చేసి గౌరమ్మకు నివేదిస్తారు.

అందుకే వేపకాయల బతుకమ్మ అంటారు. చేమంతి, గునుగు, రుద్రాక్ష తదితర పూలను ఏడు ఎత్తుల్లో పేర్చి, గౌరమ్మను వాటిపై పెడతారు.. ఇకపోతే ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజుల లో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడి పాడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ బతుకమ్మ పండుగ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే.. ఈ పండుగ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే చూసి తరించాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news