వైయస్సార్ పార్టీ నాయకుల వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది ఫైర్ అయ్యారు. టీచర్ యూనియన్ సమావేశంలో మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదని.. మంత్రి హరీష్ రావు చెప్పింది ముమ్మాటికి నిజం. అందులో ఎలాంటి అవాస్తవాలు లేవన్నారు. వైఎస్‌ఆర్ ఆశయాలను తుంగలో తొక్కింది జగన్ గ్యాంగేనని ఎద్దేశా చేశారు.
తెలంగాణ ప్రభుత్వం 73% ఫిట్మెంట్ ఇస్తే, పక్క రాష్ట్రంలో 66% మించి ఇవ్వలేదని.. కేంద్రం విధించిన షరతులకు తలొగ్గి మీటర్లు పెట్టి 7వేల కోట్లు తీసుకున్నప్పటికీ ఫిట్మెంట్ ఇవ్వలేక పోయారు అని మంత్రి చెప్పారు. ఇది వాస్తవమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ పథకాల పైన ప్రాజెక్టుల పైన అనేకసార్లు కంప్లైంట్ చేసింది.
విడిపోయి సీఎం కేసీఆర్ నాయకత్వంలో మేము బాగా అభివృద్ధి చెందుతున్నామని విమర్శలు చేశారు. మాపైన ఈర్ష్య ఉండవచ్చని మేం పట్టించుకోవడం లేదని… ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచే విధంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారని సజ్జల అనడం సరికాదని ఆగ్రహించారు. ప్రచారం కొసం ఆంధ్రప్రదేశ్ నాయకులు తెలంగాణపై గాని, టిఆర్ఎస్ నాయకులపై గానీ, మంత్రి హరీష్ రావు పై గాని అనవసరపు వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నానన్నారు.