రేగుపండును భోగిపండని ఎందుకు పిలుస్తారు.. వాటితో పిల్లలను ఎందుకు దీవిస్తారు?

-

సంక్రాంతి పండుగ అంటే సమ్ థింగ్ స్పెషల్. సందడే సందడి. ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, కోడిపందేలు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు… సరదాలు సంతోషాలు బంధువుల నడుమ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం మనం. సంక్రాంతి పండుగ ఒక్క రోజు కూడా కాదు.. మూడు రోజులు జరుపుకుంటాం. భోగి నుంచి మొదలుకొని మకర సంక్రాంతి ఆ తర్వాత కనుమ.. ఇలా మూడు రోజులు మూడు విధాలుగా పండుగను జరుపుకొని ఆనందాలను ఆస్వాదిస్తాం.

అయితే.. భోగి రోజున చిన్నారులను భోగిపండ్లయిన రేగుపండ్లతో దీవిస్తారు పెద్దలు. అదే సంక్రాంతిలో ముఖ్యమైన ఘట్టం. మరి.. ఆ రేగుపండ్ల వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.

రేగు పండు, రేగు చెట్టు వెనుక పెద్ద స్టోరీ ఉంది. రేగు పండుకు మన పురాణాలతో సంబంధం ఉంది. అంతే కాదు.. రేగు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మనం రోజూ తినే పళ్లలో లేని ఎన్నో సుగుణాలు ఈ రేగు పండులో ఉన్నాయి. అందుకే భోగి రోజు రేగు పండ్లతో పిల్లలను దీవిస్తారు.

రేగు చెట్టు అప్పట్లో మహారాణా ప్రతాప్ అనే రాజును, ఆయన సైన్యాన్ని బతికించిందట. అక్బర్ తో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన తర్వాత మహారాణా ప్రతాప్ తన సైన్యంతో కలిసి అడవిలోకి వెళ్లిపోయాడట. అక్కడ వాళ్లు చాలా ఏళ్లపాటు గడపాల్సి వచ్చిందట. తినడానికి వాళ్లకు తిండి దొరకలేదట. కానీ.. రేగు పండ్లు పుష్కలంగా దొరకడంతో వాటిని తినే వాళ్లు రోజులు గడిపారట. అలా రేగు పండు, రేగు చెట్టును దుఖభంజనీ అని పిలుస్తారట. అలా రేగు చెట్టు, రేగు పండ్ల వల్ల అన్ని బాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. శివుడికి ఇష్టమైన పండు కూడా రేగు పండే. రాముడు కూడా శబరి ఎంగిలి చేసిన రేగు పండునే తింటాడు. ఇలా ప్రతి చోట మన సంస్కృతిలో భాగమైపోయింది రేగు పండు. అందుకే.. పిల్లలకు భవిష్యత్తులో ఎటువంటి బాధలు కలగకూడదని… ఎటువంటి సమస్యలు రాకూడదని భోగి పండుగ రోజున రేగు పండ్లతో దీవిస్తారు. అందుకే వీటిని భోగిపండ్లు అని పిలుస్తారు. అది భోగిపండ్ల ప్రాశస్త్యం.

Read more RELATED
Recommended to you

Latest news