రంజాన్ ఉపవాస సమయాల్లో డీహైడ్రేషన్‌కు గురికాకూడదంటే వీటిని ఒక్కసారి తీసుకోవాలి..

-

రంజాన్ మాసం మొదలైన సంగతి తెలిసిందే..ఈ మాసాన్ని ముస్లింలు ఎంతో పవిత్రంగా చూస్తారు.. ఈ నెల రోజులు 12 గంటలకు పైగా ఉపవాసం ఉంటారు.. రోజంతా నీళ్లు తాగకుండా ఉండడం అంత సులభం కాదు. ముఖ్యంగా వేసవిలో నీళ్లు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురై తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుంది.. ముస్లింల కఠినమైన ఉపవాసం సూర్యోదయం ముందే ప్రారంభం అవుతుంది. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఏదైనా తింటారు. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత తినే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు.చాలా కాలం తర్వాత ఇఫ్తార్ తినేటప్పుడు, శరీరాన్ని రిఫ్రెష్ చేసే మరియు హైడ్రేట్ చేసే పానీయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

పుచ్చకాయ జ్యూస్..

పుచ్చకాయ ముక్కలను మిక్సీలో గ్రైండ్ చేసి అందులో కొన్ని నీళ్లు, ఐస్ క్యూబ్స్ వేసి అందులో చిటికెడు రాళ్ల ఉప్పు కలిపి తాగితే శరీరం తాజాగా, పొడిబారుతుంది..

మామిడి కాయ మింట్ జ్యూస్..

చల్లటి నీళ్లలో మామిడికాయ ముక్కలు, కొన్ని పుదీనా ఆకులు, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకుని నిదానంగా తాగితే పొడిబారకుండా ఉండి శరీరం పునరుత్తేజం పొందుతుంది..

నిమ్మకాయ మింట్ మోజిటో..

ఇది అద్భుతమైన ఇఫ్తార్ పానీయం. చల్లటి నీళ్లలో ఐస్ క్యూబ్స్, కొంచెం తేనె, గుప్పెడు పుదీనా ఆకులు, కొన్ని నిమ్మరసం వేసి బాగా కలపాలి..

నిమ్మరసం సబ్జా..

ఒక గ్లాసూ నీళ్లు తీసుకొని అందులో ఒక చెంచా నానిన సబ్జా తీసుకోవాలి.. అందులో నిమ్మరసం వేసుకొని తాగడం మంచిది..

వెల్ల సోర్బెట్..

ఉదయాన్నే నీటిలో కొంచెం బెల్లం వేసి కరిగించండి. సాయంత్రానికి కరిగిపోతుంది. తర్వాత ఆ నీటిని వడకట్టి నిమ్మరసం, కాస్త నానబెట్టిన సబ్జా గింజలు వేసి తాగాలి..ఇవే కాదు పుదీనా వేసిన చల్లని నీళ్లు, మజ్జిగ తాగిన మంచిదే..

Read more RELATED
Recommended to you

Latest news