శివరాత్రి రోజున ఉపవాసం చేస్తున్నారా? వీటిని ఉపవాసంలో తీసుకోవచ్చు..

-

మహాశివరాత్రి రానే వచ్చింది.. ఈ పర్వదినాన ప్రతి ఒక్కరు ఉపవాసం ఉంటారు.. శివుడు అనుగ్రహం కోసం నియమ నిష్టలతో పూజలు చేస్తారు.. అయితే ముఖ్యం ఉపవాసం చేస్తున్నప్పుడు ఏది తినాలి.. ఏది తినకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఉపవాసం రోజున ఉదయమంతా ఉపవాసం ఉండి రాత్రి ఓసారి భోజనం చేస్తారు. ఈ టైమ్‌లో కొంతమంది వెల్లుల్లి, ఉల్లి తినరు. కొంతమంది కొన్ని తినరు. మొత్తానికి ఏం తినకుండా ఉండలేరు. కాబట్టి, కొన్ని పండ్లు తినొచ్చు. వాటితో పాటు పాలు, పాల పదార్థాలు తీసుకోవచ్చు. వీటితో ఇంకేం తినొచ్చు.. ఎటువంటి తీసుకోవచ్చునో ఇప్పుడు చూద్దాం…

కొంతమందికి టీ, కాఫీలు లేకపోతే అస్సలు కుదరదు. అలాంటివారు వాటి బదులు స్మూతీస్, షేక్స్‌లా చేసుకుని తాగొచ్చు. షుగర్ ఉన్నవారు పంచదార బదులు బెల్లం, తేనె, డేట్స్ వంటి వాటిని అందులో వాడొచ్చు. పెరుగు, మజ్జిగ, రైతా ఎంతగా వీలైతే అంతగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో జీర్ణ సమస్యలు వస్తాయి.. పాల సంబంధిత పదార్థలు తిసుకోవడం మంచిదే.. పనీర్ టిక్కా, పాయసం ఎలా అయినా తీసుకోవచ్చు. ఇందులోని ప్రోటీన్ మీకు ఆకలి కంట్రోల్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి పనీర్ తినేందుకు ట్రై చేయండి. ఎలా అయినా తినొచ్చు..

ఇవే కాదు.. నట్స్, డ్రై ఫ్రూట్స్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో వాల్‌నట్స్, బాదం, ఖర్జూరాలు, పిస్తాపప్పులు, ఎండుద్రాక్షలు తినొచ్చు.జావా తీసుకోవచ్చు.. ఏదైనా లైటుగా జీర్ణం అయ్యే వాటిని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news