అలోవెరాతో కర్రీ.. విటమిన్ Cకు నెంబర్ వన్ డిష్..!

-

అలోవెరాను బ్యూటీ టిప్స్ లోనే వాడుతుంటారు కానీ.. దాంతో కర్రీ కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా..? ఏంటి కలబందతో కూరా.. అసలు ఎలా వండుతారు అనేగా మీ డౌట్.. అలోవెరాలో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది చేసుకుని తింటే.. బాడీకి కావాల్సిన పోషకాలు అన్నీ వస్తాయి.. ఇంకెందుకు ఆలస్యం అలోవెరా కర్రీ ఎలా చేయాలో చూద్దామా..!

అలోవెరా కర్రీకి కావాల్సిన పదార్థాలు..

అలోవెరా ముక్కలు ఒక కప్పు
పెరుగు అరకప్పు
టమోటా పేస్ట్ అరకప్పు
ఉల్లిపేస్ట్ అరకప్పు
సీడ్ లెస్ కిస్ మిస్ అరకప్పు
అల్లంవెల్లుల్లిపేస్ట్ ఒక టేబుల్ స్పూన్
హనీ ఒక టెబుల్ స్పూన్
లెమన్ జ్యూస్ రెండు స్పూన్లు
మీగడ ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర ఒక టేబుల్ స్పూన్
ఎర్రకారంపొడి ఒక టీ స్పూన్
పసుపు కొద్దిగా
ఇంగువపొడి కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా

తయారుచేసే విధానం..

అలోవెరాను పైన స్కిన్ తీసేసి.. జల్ ను సపరేట్ చేసుకుని పెట్టుకోండి. వీటిని ఒక కప్పు తీసుకుని మరిగే నీళ్లలో ఈ కలబంద జెల్ ముక్కలను 5-7 నిమిషాలు ఉడకనించి.. వడకొట్టండి. పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టేసి అందులో మీగడ వేసేసి టమోటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపేస్ట్, జీలకర్ర, ఎర్రకారంపొడి, పసుపు, ఇంగువ, కిస్ మిస్ లు వేసి మీగడలో బాగా కలియతిప్పండి. కాస్త వేగిన తర్వాత గట్టిపెరుగు వేసేసి.. తేనె కూడా వేయండి.

మంచి గ్రేవీ అవుతుంది. ఉడికిన తర్వాత అలోవెరా ముక్కలు వేసి లెమన్ జ్యూస్ కూడా వేయండి. ఫైనల్ గా కొత్తిమీర వేసేసి 5 నిమిషాలు ఉంచి తీసేయడమే.. ఎంతో రుచిగా ఉండే.. కలబంద కర్రీ రెడీ. దీనిని తింటే రోగనిరోధక శక్తి పుష్కలంగా లభిస్తుంది. అందానికి బాహ్యంగా కలబందను వాడుతూ.. ఆరోగ్యానికి ఇలా అందిస్తే ఇక తిరుగే ఉండదు. అయితే ఇది ఎక్కువగా తినకూడదు.. ఎప్పుడో ఓసారి మాత్రమే తినాలి.. కానీ ఇంట్లో ఉందికదా అని.. వారానికి మూడుసార్లు ఇదే వండుకుని తింటా అంటే మంచిదికాదట.

Read more RELATED
Recommended to you

Latest news